ఈ భూమి పై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు కచ్చితంగా మరణించక తప్పదు.అలాగే కటిక పేదవాడైనా, అమిత ధనవంతుడైన చావు ( Death ) దగ్గర అందరూ సమానులే.
కాకపోతే కాస్త ముందు వెనుక చావు వస్తుంది అనేది కచ్చితంగా చెప్పవచ్చు.అందుకే చావంటే అందరూ అంత భయపడుతూ ఉంటారు.
అయితే మరణానికి ముందు భగవంతుడు మనిషికి కొన్ని సూచనలు పంపిస్తాడు.వాటి గురించి గరుడ పురాణం,( Garudapuranam ) శివపురాణం,( Shivapuranam ) భవిష్య పురాణాలలో ఉంది.
ప్రతి జీవి యొక్క అయిష్ ప్రమాణాలను మూడు గంటలు అనేవి తప్పకుండా ఉంటాయి.వాటిలో ఏడవక గంటల్లో మృత్యువు కబళిస్తుంది.
ఒక వ్యక్తి ఎలా మరణించాలో ఏ విధంగా ఎప్పుడు మృతి ఒడిలోకి చేరాలో ఆ విధాత ఎప్పుడో, ఆ జీవి గర్భంలోకి ప్రవేశించినప్పుడే నిర్ణయించి ఉంచుతాడు.

ఆ జీవుడికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొన్ని సూచనలను ఆ భగవంతుడు( God ) పంపిస్తాడు.ఒక వ్యక్తి మరణానికి దగ్గర అయినప్పుడు అతడి కలలోకి చనిపోయిన పూర్వికులు( Dead Ancestors ) పదేపదే కనిపిస్తూ ఉంటారు.అలాగే అతడికి ఎక్కువగా నల్లటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి.
ఎడమ చెయ్యి ఒక్కసారి ఉన్నట్టుండి బిగుసుకుపోతూ ఉంటుంది.దంతాల నుంచి చిన్నగా చీము కారడం మొదలవుతుంది.
చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కాకి( Crow ) ఆ వ్యక్తి మీదకు వెళ్లడం కానీ లేదా అతన్ని తన్నడం కానీ చేస్తుంది.ఇలాంటి సూచనలు వస్తే త్వరలోనే అతడికి మరణం సంభవిస్తుందని అర్థం చేసుకోవచ్చు.

మరణానికి దగ్గర అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం( Reflection ) నూనెలో కానీ, అతనిలో కానీ సరిగ్గా కనిపించకుండా అస్పష్టంగా కనిపిస్తుంది.చనిపోవడానికి రెండు నెలల ముందు అతని శరీరం లేత పసుపు రంగులోకి మారుతుంది.మరణ గడియలు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయం అనేది పెరుగుతుంది.అతని చుట్టూ ఏదో జరుగుతున్నట్లు, ఎవరో అతన్ని గమనిస్తున్నట్లు పై నుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే తన భార్య పిల్లలు, తోబుట్టులను పదే పదే చూడాలి అనిపిస్తుంది.అదే విధంగా తను ఇప్పటివరకు చేసిన పాపపుణ్యాలు తాలూకు జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి.
DEVOTIONAL