టాలీవుడ్ లో మైత్రి మూవ్ మేకర్స్ స్టార్ ప్రొడక్షన్ సంస్థగా కొనసాగుతూ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఇందు కోసం స్టార్ హీరోలను, స్టార్ డైరెక్టర్లను లైన్లో పెడుతూ వారికీ భారీ రెమ్యునరేషన్స్ ను ఆఫర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా ఒక సినిమా సెట్ చేయడానికి భారీ ఖర్చు చేస్తున్నట్టు తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది.మైత్రి మూవ్ మేకర్స్ ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా రోజులే క్రితమే కమిట్మెంట్ తీసుకున్నట్టు ఈ సంస్థ ఇప్పటికే అధికారికంగా చెప్పుకొచ్చింది.
ఇందుకు ప్రభాస్ కు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వబోతున్నారని.అలాగే ఇప్పటికి 20 కోట్ల అడ్వాన్స్ కూడా ప్రభాస్ కు ఇచ్చారని పలు నివేదికలు తెలిపాయి.
మరి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
ప్రభాస్, మైత్రి కాంబోలో రాబోయే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసారని అతడి కోసం భారీ ఆఫర్ కూడా చేసినట్టు టాక్.
అతడు మరెవరో కాదు.బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుంది అని వార్తలు గతంలో వైరల్ అయిన విషయం విదితమే.అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో సినిమా ఉందని.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి./br>
మైత్రి మూవీ మేకర్స్ ఇందుకోసం ఈ స్టార్ డైరెక్టర్ కు ఏకంగా 80 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే అడ్వాన్స్ రూపంలో 25 శాతం అందుకున్నాడు అని అంటున్నారు.ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ వైరల్ అయ్యింది.
ప్రభాస్ కోసం మైత్రి మూవీస్ మేకర్స్ వారు కాస్ట్లీ డైరెక్టర్ ను తీసుకు వస్తున్నారు అంటూ టాక్ నడుస్తుంది.మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ముందుకు వెళుతుందో చూడాలి.