అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) త్వరలోనే తండేల్( Thandel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో నాగచైతన్య మొదటిసారి జాలరి పాత్రలో కనిపించబోతున్నారు.డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.ఇక ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి( Sai Pallavi ) నటించబోతున్న విషయం తెలిసిందే .ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ వంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా ట్రైలర్ వైజాగ్ లో( Vizag ) విడుదల చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు నాగచైతన్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రతి ఒక్కరికి నచ్చే చిత్రమే తండేల్ .ఈ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాను నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.ఇక తన భార్య శోభిత( Sobhita )ను ఉద్దేశించి మాట్లాడుతూ తాను వైజాగ్ అమ్మాయి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.నా ఫ్యామిలీలో రూలింగ్ పార్టీ వైజాగ్.
ఈ వైజాగ్ లో నా సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలి లేకపోతే ఇంట్లో నా పెళ్ళాం ముందు నా పరువు పోతుందని సరదాగా నాగచైతన్య అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక మరోసారి నాగచైతన్య హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకోబోతున్నారని స్పష్టమవుతుంది.