ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వింటర్ లోనూ పెదాలు మృదువుగా అందంగా మెరుస్తాయి!

ప్రస్తుత చలికాలంలో పెదాలు తరచూ పొడిబారిపోయి పగిలిపోతుంటాయి.వాతావరణంలో వచ్చే మార్పులు, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, ఆహారపు అలవాట్లు, పోష‌కాల కొరత తదితర కారణాల వల్ల తేమ తగ్గిపోయి పెదాల పగుళ్లు సమస్య ఏర్పడుతూ ఉంటుంది.

 Follow This Simple Tip To Keep Your Lips Soft And Shiny Even In Winter!,soft Lip-TeluguStop.com

ఈ పగుళ్లు వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పెదాలు అందవిహీనంగా మారతాయి.ఈ క్రమంలోనే పగిలిన పెదాలను రిపేర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే పెదాల‌ పగుళ్ళు అన్నమాట అనరు.వింటర్ లోనూ మీ పెదాలు మృదువుగా మరియు అందంగా మెరుస్తాయి.మరి ఇంత‌కీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు కాఫీ బీన్స్ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే ఆరు టేబుల్ స్పూన్ల స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను వేసి బాగా కలిపి ఒక రోజంతా వదిలేయాలి.మరుసటి రోజు ప‌ల్చ‌టి వ‌స్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ కాఫీ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్లు పెదాలకు అప్లై చేసుకోవాలి.

ఈ విధంగా చేస్తే పెదాల పగుళ్లు క్రమంగా దూరమవుతాయి.మళ్లీ మళ్లీ పగలకుండా ఉంటాయి.

అదే సమయంలో పెదాలు మృదువుగా మరియు కోమలంగా మార‌తాయి.ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల పెదాల నలుపు ని సైతం వదిలించుకోవచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube