గంధంను ముఖ సౌందర్యంలో చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.గంధం అనేది డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.ఇప్పుడు ఏ చర్మ తత్త్వం ఉన్నవారు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
1.జిడ్డు చర్మం గలవారు కావలసిన పదార్ధాలు గంథం పొడి – అరస్పూన్ ముల్తాని మట్టి – అరస్పూన్ రోజ్ వాటర్ – 2 స్పూన్స్ఎలా ఉపయోగించాలి ఒక బౌల్ లో గంధం పొడి,ముల్టానా మట్టి,రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం మీద జిడ్డు సమస్య తొలగిపోతుంది.
2.పొడి చర్మం కావలసిన పదార్ధాలు గంధం పొడి – అరస్పూన్ కొబ్బరినూనె – 1 స్పూన్ఎలా ఉపయోగించాలి.
కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి దానిలో గంధం కలిపి ముఖానికి రాసి 10నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే పొడి చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
3.సాధారణ చర్మం కావలసిన పదార్ధాలు దోసకాయ రసం – 2 స్పూన్స్ గంధం పొడి – 1 స్పూన్ఎలా ఉపయోగించాలి.
దోసకాయ రసంలో గంధం పొడిని కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మంపై వచ్చే మొటిమల సమస్యలు తగ్గిపోతాయి.