తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే తెలుగు దర్శకులు సైతం మంచి సినిమాలు చేయడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక తెలుగు వరకు బాగానే ఉంది కానీ తమిళ్ సినిమా దర్శకులు( Tamil Directors ) మాత్రం ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకునేవారు.కానీ ఇప్పుడున్న కొంతమంది యంగ్ డైరెక్టర్స్ మాత్రం ఎప్పుడో పాత కథలను తీసుకొచ్చి మళ్ళీ జనాల మీద రుద్దుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న రోజుల్లో వెట్రీ మారన్,( Vetrimaaran ) పా రంజిత్,( Pa Ranjith ) మారి సెల్వరాజ్( Mari Selvaraj ) లాంటి దర్శకులు క్యాస్ట్ బేస్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళు ఇప్పటికి అలాంటి కథాంశాలతోనే సినిమాలను చేస్తున్నారు.వాళ్లకి కొత్త కథలు దొరకడం లేదా లేదంటే వాళ్ళు ఆ కథలతోనే సినిమాలు చేయగలరా వేరే కధలతో సినిమాలు తీసి సక్సెస్ లు కొట్టలేమనే ఒక బ్రహ్మలో బతుకుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక వీళ్ళు తీసే సినిమాలకి మంచి గుర్తింపు వచ్చినప్పటికి ఎప్పుడూ అవే సినిమాలు తీయడం వల్ల వీళ్ళ మీద రెస్పెక్ట్ అనేది పోతుంది.
కాబట్టి ఇప్పటికైనా కొంచెం కొత్త తరహా కథలతో సినిమాలను తీస్తే మంచిదని యావత్ ఇండియన్ సినిమా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక రీసెంట్ గా వెట్రిమారన్ తీసిన ‘విడుదల 2’( Viduthalai Part 2 ) సినిమా ప్లాప్ అయింది.రొటీన్ రొట్ట ఫార్ములా స్టోరీ తో రావడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళందరూ తమ స్టైల్ ను మార్చుకోవాల్సిన అవసరమైతే వచ్చిందనే చెప్పాలి…
.