సాధారణంగా చుండ్రు అనేది కొందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.చుండ్రు కారణంగా వేళ్ళు ఎప్పుడు తలలోనే ఉంటాయి.
ఎందుకంటే అంత తీవ్రంగా దురద ఉంటుంది.అలాగే చుండ్రు కారణంగా జుట్టు అధికంగా ఊడిపోవడం, కురులు డ్రై గా మారడం తదితర సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే చుండ్రు సమస్య( Dandruff )ను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
ఈ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే చాలా వరకు చుండ్రు మాయమవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ జ్యూస్ ( Onion Juice )ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ వేప నూనె( Neem oil ), నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా కనుక చేస్తే తలలో చుండ్రు చాలా వరకు పోతుంది.
ఒకవేళ ఇంకా కనుక ఉంటే మరో రెండు మూడు సార్లు ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.చుండ్రుకు శాశ్వతంగా బై బై చెప్పండి.అలాగే ఈ రెమెడీ వల్ల మీ హెయిర్ రూట్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతుంది.
కాబట్టి చుండ్రు సమస్య ఉన్నవారు మాత్రమే కాదు హెయిర్ ఫాల్ తో సతమతం అవుతున్న వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.