రాజమౌళి బాహుబలి ఎప్పుడైతే రెండు పార్ట్ లుగా విడుదల చేసారో అప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కొత్త అరవడి సృష్టించారు.ఇంతకు ముందు ఏ సినిమా అయినా రెండున్నర గంటల్లో డైరెక్టర్స్ పూర్తి చేసేవారు.
కానీ ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాల విషయం లో అలా జరగడం లేదు.ప్రతి సినిమా సీక్వెల్ ( Sequel Movies ) చేయడమే లక్ష్యంగా పెట్టుకొని దర్శకులు తమ సినిమాలను తయారు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో అయితే ఈ రకమైన ఒరవడి బాగా పెరిగిపోయింది.మరి లేటెస్ట్ దర్శకులు తమకు ఇచ్చిన బడ్జెట్ లో సినిమా తీయలేకపోతున్నారా ? లేదంటే బిజినెస్ కోసం ఇలా స్ట్రాటజీ వాడుతున్నారా అనే పెద్ద ప్రశ్న గా మిగిలిపోయింది.
రాజమౌళి( Rajamouli ) బాహుబలి సినిమా కథ లెన్త్ ఎక్కువ కావడం తో రెండు భాగాలుగా తీసి 2400 కోట్ల రూపాయల బాక్స్ ఆఫీస్ వసూళ్లను సాధించాడు.ఇక రాజమౌళి ప్రభావంతో ప్రశాంత్ నీల్( Prasanth Neel ) కూడా కెజిఎఫ్ సినిమాను రెండు భాగాలుగా తీసి 1500 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాడు.
పుష్ప ( Pushpa ) చిత్రం కూడా మొదట్లో ఒక పార్ట్ అనుకోని మొదలెట్టి రెండో భాగాన్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు మన లెక్కల మాస్టారు.మణి రత్నం పొన్నియన్ సెల్వన్ కూడా రెండు పార్టులుగా తీశారు.
అయన అదృష్టం కొద్దీ మొదటి భాగం ప్లాప్ అయినా రెండో పార్ట్ గట్టెక్కించింది.
కొరటాల శివ దేవర సినిమాను( Devara Movie ) కూడా ఇప్పుడు రెండు భాగాలు చేస్తున్నాడు.ఇక ప్రతి సినిమా మొదటి పార్ట్ హిట్ అయితే ఇక ఆ దర్శకుల మరియు హీరోల పంట పడినట్టే.రెండో భాగానికి పిచ్చి క్రేజ్ ఏర్పడుతుంది.
అందుకే ఈ సినిమాలతో పాటు రానున్న సలార్,( Salaar ) OG, హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి.అయితే సినిమా మొదలు పెట్టినప్పుడు రెండు భాగాలు అని ప్రకటించి సినిమా తెస్తే పర్వాలేదు కానీ ఒక పోర్షన్ షూటింగ్ అయ్యాక లేదా సినిమా లెన్త్ పెరుగుతునం కొద్దీ మధ్యలో ఇలా రెండు పార్టులు అంటూ డైరెక్టర్స్ ప్రకటించడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా హ్యాండిల్ చేయడం లో ఎదురయ్యే సమస్యలు, బడ్జెట్ ఎక్కువగా పెరిగిపోవడం, అనవసర సీన్స్ అన్ని తీసి దాన్ని ఎలా కట్ చేయాలో తెలియక రెండు పార్ట్శ్ చేసి బాగానే మార్కెట్ చేసుకుంటున్నారు.గౌతమ్ తిన్ననూరి మరియు విజయ్ దేవరకొండ సినిమా కూడా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇది రికవరీ చేయాలంటే రెండు పార్ట్స్ గా సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ డిసైడ్ అయ్యారట.ఇది ఇలాగే కొనసాగితే ప్రతి సినిమా రెండో పార్ట్ వచ్చేలా ఇప్పుడు ఉన్న చిత్రాల పోకడ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.