చర్మం మృదువుగా, అందంగా, కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, ఎప్పుడు ఏదో ఒక చర్మ సమస్య వెంటాడుతుంటుంది.
మొటిమలు, నల్ల మచ్చలు, చర్మం పొడి బారిపోవడం ఇలా రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి.దీంతో ఈ సమస్యల నుంచి బయట పడేందుకు ఎంతో ఖర్చు పెట్టి.
రకరకాల క్రీములు, ఫేస్ ప్యాకులు, లోషన్లు వంటివి కోనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, ఇలాంటి తాత్కాలికంగా మాత్రం పరిష్కారాలను అందిస్తాయి.
శాశ్వత పరిష్కారాలు కావాలనుకునే వారు న్యాచురల్ పద్ధతిలో వెళ్లడమే మంచిదంటున్నారు నిపుణులు.అయితే చర్మాన్ని మృదువుగా మార్చడంలో, మొటిమలను మరియు డార్క్ స్పాట్స్‌ను తగ్గించడంలో, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సగ్గుబియ్యం అద్భుతంగా సహాయపడతాయి.
మరి సగ్గుబియ్యాన్ని చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం పొడి, పాలు మరియు తేనె వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమానికి ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరిపోనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు పోగొట్టి.చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా మారుస్తుంది.మొటిమలు, నల్ల మచ్చలతో ఇబ్బంది పడే వారు.ఒక బౌల్‌లో సగ్గు బియ్యం పొడి, బియ్యం పిండి మరియు ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి ఇలా చేస్తే.మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుముఖం పట్టి ముఖం కాంతివంతంగా మారుతుంది.