ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నా.. దయచేసి సాయం చేయండి.. పావలా శ్యామల ఎమోషనల్!

తెలుగు ప్రేక్షకులకు నటి లేడీ కమెడియన్ పావలా శ్యామల( Pavala Syamala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ తరం వారికి ఈమె గురించి అందగా తెలియక పోయిన ఇదివరకటి సినిమాలు చూసే వారికి ఈమె బాగా సుపరిచితం.

 Pavala Syamala Request To Tollywood Heroes, Pavala Syamala, Tollywood, Health Pr-TeluguStop.com

తెలుగులో లేడీ కమెడియన్గా సహాయనాటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి పావలా శ్యామల.సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

ఇది ఇలా ఉంటే ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.చాలా ఏళ్లుగా ఆమె మంచానికి పరిమితం అయింది.

Telugu Problem, Pavala Syamala, Pavalasyamala, Tollywood-Movie

ఇప్పటికీ ఆమె పరిస్థితిని చూసి చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే.ఆమె ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టుగా ఆర్థిక పరిస్థితులు కూడా మొదలయ్యాయి.అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి ( film industry )దూరమైన ఆమె కష్టంగా జీవనం సాగిస్తున్నారు.అయితే త‌న ఆర్థిక ప‌రిస్థితి బాగ‌లేద‌ని త‌న‌కు సాయం చేయండి అంటూ పావ‌లా శ్యామ‌ల తాజాగా ఒక వీడియో పెట్టింది.50 ఏండ్లుగా క‌ష్ట‌ప‌డి న‌టిగా బ్రతికాను.ఈ మూడు ఏండ్ల నుంచి నా ప‌రిస్థితి ఎలా అయ్యిందో అంద‌రికీ తెలుసు.

ఈ విష‌యం చాల ఇంట‌ర్వ్యుల‌లో కూడా చెప్పాను.కానీ ఎవ‌రు స్పందించ‌లేదు.

ఎలాగో ఇంత‌వ‌ర‌కు వ‌చ్చాను.ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను.

Telugu Problem, Pavala Syamala, Pavalasyamala, Tollywood-Movie

ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా అండి అంటూ వేడుకుంది.దాదాపు 300 సినిమాలు చేశాను. చిరంజీవితో ప్రభాస్‌తో మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద హీరోల అంద‌రితో చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను.ట్రీట్మెంట్ చేయించుకోలేక అవస్థగా ఉన్నాను.

న‌న్ను ఇలానే వ‌దిలేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తారా ద‌య‌చేసి నాకు సాయం చేయండి అంటూ శ్యామ‌లా త‌న ఆవేద‌నను వ్య‌క్తం చేసింది.మరి ఈ విషయంపై టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరైనా స్పందించి ఆమెకు సహాయాన్ని అందిస్తారేమో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube