గుడిలో తీర్థం సేవించి, ఇలా చేయకండి?

తీర్థం యొక్క విశిష్టతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గుడికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం అయ్యాక తీర్ధం తీసుకుంటూ ఉంటాం.

 Facts Behind Tirth Prasad In Temple Details, Teertham, Tirtham In Temple, Temple-TeluguStop.com

తీర్ధాన్ని మూడు సార్లు తీసుకుంటాం.ఆలా మూడు సార్లు తీర్ధం ఎందుకు తీసుకుంటారో చాలా మందికి తెలియదు.

తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి.చాలా పవిత్రంగా తయారైన తీర్ధం తీసుకోవటం వలన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

ఇప్పుడు తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవటంలో గల పరమార్ధాన్ని తెలుసుకుందాం.మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు బాగుంటాయి.ఇక మూడో సారి తీర్థం తీసుకొనే సమయంలో పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.

తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, మంచి చేస్తుందని భావన మరియు ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే భావనతో తీసుకోవాలి.కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకొనే సమయంలో అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అంటూ మంత్రాన్ని జపించాలి.

తీర్థాన్ని తీసుకున్నాక చాలా మంది తలపై తుడుచుకుంటారు.ఈ విధంగా చేయటం చాలా తప్పు.ఎందుకంటే తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు.మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube