ఇలాంటి భార్యా దొరికితే మీ జీవితం స్వర్గమే.. ఎందుకో తెలుసుకోండి..!

మనిషి ఎంత సంపాదించినా తృప్తి అనేది ఎంతో ముఖ్యం.అది లేకపోతే మనిషి కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు.

 If You Find A Wife Like This, Your Life Will Be Heaven Know Why , Wife, Husband-TeluguStop.com

అలాగే ఆనందాన్ని కూడా కోల్పోతాడు.దానికి ఉదాహరణగా ఈ కథను చెప్పుకోవచ్చు.

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్తాడు.కానీ గుర్రానికి సరైన భేరం దొరకదు.

దీంతో ఆ గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకుంటాడు.మరి ఒకరి సలహాతో గుర్రం నుంచి గాడిదలను తీసుకుంటాడు.

చివరికి గాడిదను ఇచ్చి బూట్లు తీసుకుంటాడు.బూట్లు ఇచ్చి చివరకు ఒక టోపీని తీసుకుంటాడు.

ఆ టోపీ పెట్టుకుని దారిలో వంతెన మీద నడుస్తూ వస్తుంటాడు.

Telugu Find, Vastu, Vastu Tips, Heaven-Telugu Bhakthi

ఇంతలో రాయి తగిలి బోర్ల పడతాడు.దీంతో టోపీ కాస్త నదిలో పడుతుంది.దిగులుగా అటే చూస్తూ కూర్చుంటాడు.అదే దారిలో వచ్చే ఇద్దరు వ్యక్తులు ఏమైందని అడుగుతారు.దీంతో అసలు విషయం చెబుతాడు.అప్పుడు వారు నీకు ఇవాళ ఉపవాసమే అని ఒకడు, మరొకడు అయితే నీకు బడిత పూజ అని అంటాడు.దీంతో ఆ వ్యక్తి నా పెళ్ళాం అలాంటిది కాదు అంటాడు.

దీంతో వారిద్దరు కూడా వేటగాడు ఇంటికి వెళ్తారు.వెంటనే గుమ్మంలో నుంచి భార్యను( wife ) పిలుస్తాడు.

అతడి పెళ్ళాం ఎదురుగా వచ్చి బావ వచ్చావా అని ఆప్యాయంగా పలకరిస్తుంది.అతడు జరిగింది అంతా చెప్పడం మొదలు పెడతాడు.

దీంతో గుర్రం ధర పలకకపోతే ఆవును తీసుకున్నా అంటాడు.దీంతో మంచి పని చేశావు పాలు తాగొచ్చు అంటుంది.

ఆ తర్వాత ఆవును కాదని గాడిదను తీసుకున్న అని వేటగాడు ఉంటాడు.దీంతో అడవి నుంచి కట్టెలు మోసుకు వస్తుంది లేండి అంటుంది.

భార్య గాడిద ను అమ్మి చెప్పులు తీసుకున్నా అంటాడు.అడవిలో రాళ్లు రప్పలు తగలకుండా ఉంటుంది అని భార్య చెబుతుంది.

Telugu Find, Vastu, Vastu Tips, Heaven-Telugu Bhakthi

అది కూడా ఉంచుకోలేక టోపీ తీసుకున్నాను.దీంతో ఆ టోపీలు అందంగా ఉంటారు అంటుంది భార్య.అలా వస్తు ఉంటే నేను వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి కింద పడిపోతుంటే టోపీ నీళ్లలో పడిపోయింది అని వేటగాళ్ళు చెబుతాడు.పోతే పోయింది నువ్వు పడలేదు అంతా అడవి తల్లికి దయ అంటుంది.

గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను ఒక్క మాట కూడా అనకుండా భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి ధన్యవాదాలు చెప్పింది.ఆమె మంచి మనసు చూసి ఆ ఇద్దరు బాటసారులు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతారు.

ఇలాంటి భార్య ఎవరికి దొరికినా కూడా వాళ్ళ జీవితం స్వర్గమే అని కచ్చితంగా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube