ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం.6.14
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: సా.5.30 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీకు ఇచ్చే అప్పు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీనివల్ల మరింత నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం పొందుతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
కొన్ని విలువైన వస్తువులు తాకట్టు పెట్టాల్సి వస్తుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మిథునం:

ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగక పోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఎదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవాలి.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోక తప్పదు.అనవసరమైన వస్తువులు వీలైనంత వరకు కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి.ఏ వ్యాపారస్తుడైనా ఆలోచనలతో ముందుకు నడవాలి.
కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరుల నుండి సహాయాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తుల:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.
పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు జాగ్రత్తలు అవసరం.
ధనుస్సు:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సంతానం పట్ల ఆలోచన చేయాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందిని ఎదుర్కొంటారు.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంది.దీనివల్ల నిరుత్సాహ పడతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ప్రశాంతత కోసం కొన్ని ప్రయాణాలు చేయాలి.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని కాపాడుకోవాలి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకండి.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
దీని వల్ల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.
చాలా ఉత్సాహంగా ఉంటారు.