కింగ్‌స్టన్‌ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవి ప్రకాష్( Jv Prakash ) హీరోగా తెరకెక్కిన సినిమా కింగ్‌స్టన్‌.( Kingston ) ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటించగా చేతన్ కాదంబి, అజగన్ పెరుమాళ్, సాబుమాన్ అబ్దుసమద్, ఎలాంగో కుమారవేల్ ఇలాంటి సెలబ్రిటీలు కీలక పాత్రల్లో నటించారు.

 Kingston Movie Review And Rating, Kingston, Kingston Movie, Review And Rating, T-TeluguStop.com

కమల్ ప్రకాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.తమిళ్ లో తెరకెక్కిన కింగ్ స్టన్ సినిమా డబ్బింగ్ తో తెలుగులో కూడా తాజాగా మార్చి 7న రిలీజ్ అయ్యింది.మరి ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.

కథ:

1982లో సముద్ర తీర ప్రాంతంలోని ఒక గ్రామంలో బోసయ్య (అజగన్ పెరుమాళ్) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేసి పాతి పెడతారు.అది ఆత్మ అయి గ్రామస్థులను భయపెడుతుండటంతో, ఆ గ్రామస్తులు ఆ శవాన్ని సముద్రంలో పడేస్తారు.తరువాత సముద్రంలోకి ఎవరు వెళ్లినా శవాలుగా తిరిగొస్తుండటంతో ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళొద్దని, ఆ ఊరి సముద్రానికి కంచె వేస్తారు.

ఆ ఊరి వాళ్లకు పని పోతుంది.దాంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్లి మరో సముద్రం ఉన్న సిటీలో సెటిల్ అయిన థామస్ అనే రౌడీ వాళ్లకు పని ఇస్తాడు.

ప్రస్తుతం 2025లో కింగ్ స్టన్(జీవి ప్రకాష్ కుమార్) థామస్(సాబుమాన్ అబ్దుసమద్) వద్దే డబ్బు కోసం పని చేస్తుంటాడు.థామస్( Thomas ) చెప్పినట్టు సముద్రంలోకి వెళ్లి శ్రీలంక బోర్డర్ లో అక్రమంగా ఏదో తరలిస్తూ ఉంటారు కింగ్ స్టన్ అతని స్నేహితులు.

ఒక రోజు సముద్రంలో నేవీ అధికారులు వాళ్ల పై అటాక్ చేయడంతో ఒక పిల్లాడు చనిపోతాడు.దీంతో థామస్ వాళ్ళతో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడని తెలిసి కింగ్ స్టన్ అతనికి ఎదురు తిరిగి తన ఊరి వాళ్ళు ఎవరూ కూడా ఇక అతని దగ్గరికి పనికి రారు అని చెప్తాడు.

ఊర్లో మూసేసిన సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలు పట్టుకొస్తే ఊరి వాళ్ళు ఆత్మలు, దయ్యాలు లేవని నమ్ముతారని కింగ్ స్టన్ అతని స్నేహితులు థామస్ ని కూడా తీసుకొని మూసేసిన సముద్రంలోకి వెళ్తారు.కింగ్ స్టన్ గర్ల్ ఫ్రెండ్ రోజ్( Rose )(దివ్య భారతి)కూడా వాళ్ళ షిప్ లో వెళ్తుంది.

మరి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారు? అక్కడ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? వీళ్లంతా తిరిగి వచ్చారా? అసలు సముద్రంలోకి వెళ్లిన వాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు? బోసయ్యని ఎందుకు చంపారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Telugu Jv Prakash, Kingston, Kingston Review, Review, Tollywood-Movie

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్ లో 1982లో జరిగింది కాస్త కథ చూపించి ప్రస్తుతంలో హీరో పాత్ర, ఆ ఊరి వాళ్ళ కష్టాలు, హీరో పని చూపిస్తారు.సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులలో ఆత్రుత నెలకొంటుంది.నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ కలుగుతుంది.

సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా సముద్రం మీదే సాగుతుంది.సినిమా మొత్తం అంతా కూడా హర్రర్ త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తోనే సాగుతుంది.

ముఖ్యంగా సినిమాలో సముద్రంలో సీన్స్ అదిరిపోయాయని చెప్పాలి.ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా ఆసక్తికరంగా అంటాయి.

క్లైమాక్స్ లో ఇచ్చే కొన్ని ట్విస్టులు బాగానే వర్కౌట్ అయ్యాయి.

Telugu Jv Prakash, Kingston, Kingston Review, Review, Tollywood-Movie

నటీనటుల పనితీరు:

జీవి ప్రకాష్ కుమార్ ఓ పక్క సంగీత దర్శకుడిగా సంగీతంతో అదరగొట్టడంతో పాటు నటుడిగా కూడా బాగానే అలరించారు.ముఖ్యంగా సినిమాలో తమిళ్ విలేజ్ కుర్రాడిగా మాస్ క్యారెక్టర్ లో బాగా నటించి మెప్పించారు జీవి ప్రకాష్.ఇక దివ్య భారతి కూడా తన అందాలతో బాగానే ఆకట్టుకుంది.

చేతన్ కాదంబి ( Chetan Kadambi )రెండు షేడ్స్ లో బాగా నటించాడు.బోసయ్య పాత్రలో అజగన్ పెరుమాళ్ మెప్పిస్తాడు.

ఎలాంగో కుమారవేల్, థామస్ గా సాబుమాన్ అబ్దుసమద్ పర్వాలేదనిపించారు.మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.

Telugu Jv Prakash, Kingston, Kingston Review, Review, Tollywood-Movie

సాంకేతికత:

సినిమాటోగ్రఫీ విజువల్స్( Cinematography Visuals ) మాత్రం బాగున్నాయి.సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.సముద్రంలోని గ్రాఫిక్స్ సీన్స్ అన్ని మెప్పిస్తాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భయపెట్టినా పాటలు మాత్రం తెలుగు డబ్బింగ్ లో వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి.దయ్యాలు సెటప్ కి మేకప్ టీమ్ కూడా బాగానే పనిచేసింది.

రెగ్యులర్ పాయింట్ అయినా కొత్తగా సముద్రంలో చెప్పాలనే ఆసక్తికర కథనంతో డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు.దర్శకుడిగా మాత్రం టేకింగ్ బాగా తీసాడు.కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది.

రేటింగ్ :

3/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube