పిల్లలు అవలక్షణాలతో పుట్టకూడదు అంటే గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రతీ ఏడాది వేలకొద్దీ కానుపుల్లో పిల్లలు ఊహించని విధంగా పుడుతున్నారు.అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న సమస్యలు ఉంటాయని న్యూఢిల్లీకి చెందిన గైనాకాలిస్టు సీమా శర్మ చెబుతున్నారు.

 How Should A Pregnant Women Protect Baby From Disabilities-TeluguStop.com

ఆమె భారత రాజధానిలో జరిగిన ఒక వైద్య సదస్సులో మాట్లాడుతూ, పిల్లలని అవలక్షణాల నుంచి తల్లిదండ్రులే సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.అందుకోసం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు.

అవేంటో చూడండి.

* మేకప్, హేయిర్ కలర్, బ్లీచెస్ లాంటి కాస్మోటిక్ కెమికల్స్ కి దూరంగా ఉండాలి అంట.ఈ 9 నెలలు హంగులు, ఆకర్షణకి వెళ్ళకుండా సింపుల్ గా ముస్తాబయితేనే మంచిది.

* సిగరేట్ తాగేవాళ్ళకి దూరంగా ఉండాలి.

సిగరేట్ స్మోక్ కి రెండు మీటర్ల దూరంలో ఉన్నా ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై పడుతుందట.ఇంట్లో స్మోకర్స్ ఉంటే తాగటం మానేయమని చెప్పాలి.

ముఖ్యంగా భర్త స్మోకింగ్ కి దూరంగా ఉండాలి.

* పండ్లని బాగా కడిగి తినాలి.

ముఖ్యంగా రేగుపళ్ళు, ఆపిల్, సపోటా, ద్రాక్ష లాంటి ఫలాల్లో పెస్టిసైడ్స్ ఉండే అవకాశం ఎక్కువంట.కూరగాయలు బాగా కడిగి తినాలి, వండుకోవాలి.

ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది.

* బయటి ఫుడ్ పూర్తిగా మానెయ్యాలి.

మరీ ముఖ్యంగా రోడ్డు మీద దొరికే ఆహారం.అది పానిపూరి కావచ్చు, వడా పావ్ కావచ్చు, మాసాల బజ్జీ కావచ్చు.

ఇలాంటి సమయంలో బ్యాక్టీరియా ఉండే రోడ్ సైడ్ ఫుడ్ తో అస్సలు రిస్క్ తీసుకోకూడదు.

* తల్లికి కాఫీ తాగే అలవాటు ఉంటే మానెయ్యాలి.

కేఫైన్ ని కడుపులో బిడ్డ తీసుకోలేదు.బిడ్డ శరీరం అప్పుడే తట్టుకునేంతగా ఎదిగి ఉండదు.

ఇది బిడ్డ ప్రాణానికి కూడా ముప్పు కావచ్చు.

* గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి రంగు వేయకపోవడమే మంచిది.

సింథెటిక్ కలర్స్ లో కెమికల్స్ బాగా ఉండాయి.దాన్నే తల్లి పీల్చుకుంటుంది, అదే బిడ్డ దాకా చేరుతుంది.

* ఆల్కహాల్ ఇటు తల్లి తాగకూడదు, అలాగే తండ్రి తాగకూడదు .తండ్రికి తాగే అలవాటు ఉంటే శారీరకంగా భాగస్వాములు దగ్గరగా ఉండకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube