మన ఇంట్లో ఈ వాస్తు నియమాలను పాటిస్తే ఎప్పుడూ సుఖసంతోషాలే...

మన భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.మనదేశంలోని ప్రజలే కొంతమంది ఈ శాస్త్రాలను మూడు నమ్మకాలు అని కూడా అంటారు.

 If We Follow These Vastu Rules In Our House We Will Always Be Happy Details, Vas-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకోవడం వల్ల ఎలాంటి దోషాలు, సమస్యలు రావు అని చాలామంది ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.

ఒకవేళ ఇంట్లో వాస్తుదోషం ఉంటే అందుకోసం ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును తయారు చేయడం ద్వారా వాస్తు లోపం తొలగిపోతుంది.

స్వస్తిక్ సంకేతం వల్ల ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందట.

అలాగే ఇంటి ప్రవేశ ద్వారా వద్ద సాయంత్రం సమయంలో క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం కచ్చితంగా చెయ్యాలి.

అంతేకాకుండా వాస్తుదోషాన్ని తొలగించడానికి చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయాలి.ఇంటి ప్రధాన ద్వారం వద్ద పొద్దుతిరుగుడు పువ్వు చిత్రాన్ని ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిది.

ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలగజేస్తుందని కొంతమంది ప్రజలు విశ్వసిస్తారు.అలాగే ఇంటిలో నైరుతి మూలలో చికటి లేకుండా ఉండేలా చూసుకోవాలి.

Telugu Astrology, Greenary, Happy, Vasthu, Swastik Mark, Vasthu Dosham, Vastu, V

అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం వేళలో వాయువ్య దిశలో వెలుతురు ఉండాలి.ఈ సమయంలో చీకటి ఉన్నట్లయితే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది.అలాగే ఎండిన చెట్లు లేదా మొక్కలను ఇంట్లో, బాల్కనీలో ఎప్పుడూ ఉండనీయకూడదు.ఇంటిని ఆకుపచ్చ చెట్లతో ఎప్పుడూ పచ్చ గా ఉండేలా చూసుకోవాలి.పచ్చదనంగా ఉండే ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది.ఈ పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోయి ఇంటి లోని కుటుంబ సభ్యులంతా ఆనందంగా సుఖసంతోషాలతో ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube