పంచరామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.ఆ రోజు ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, 16వ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి అభిషేకాలు, కుంకుమ పూజలు, సాయంత్రం 5 గంటలకు లక్ష ముత్యాల పూజ,లక్ష ప్రతిపూజ, లక్ష కుంకుమార్చన ఆ తరువాత స్వామివారి లీలా కళ్యాణం, సాయంత్రం ఆరు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జ్యోతిర్లింగార్చన మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి.
అంతే కాకుండా ఫిబ్రవరి 17వ తేదీన అభిషేకాలు, కుంకుమ పూజలు ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి పర్వదినం జరుపుకొని తెల్ల వారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి వారి దర్శనం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అభిషేకాలు, రాత్రి 8 గంటల ముప్పై ఐదు నిమిషములు నుంచి జగాజ్యోతి నీ కూడా వెలిగిస్తారు.

ఇంకా చెప్పాలంటే అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి పాగా కడతారు.రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారు జామున నాలుగు గంటల వరకు దేవాలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.ఫిబ్రవరి 18వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు రావణnబ్రహ్మ వాహనం పై స్వామి వారి గ్రామోత్సవం కూడా జరుగుతుందని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా ఈ పుణ్య కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం కట్టు దిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.ఈ సమావేశంలో దేవాలయ కార్య నిర్వహణ అధికారి సూర్యనారాయణ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కోరాడా శ్రీనివాస్ పాల్గొన్నారు.