ఈనెల 19వ తేదీన దేశ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆ పరమేశ్వరుడికి విష్ణు దేవుడికి పూజలు చేస్తారు.
అయితే కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడిందని పండితులు తెలియజేస్తున్నారు.ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన పాక్షిక చంద్ర గ్రహణం అని పండితులు తెలిపారు ఈ ఏడాదిలో రానున్న చివరి చంద్రగ్రహణం కూడా ఇదేనని నాసా ప్రకటించింది.
ఈ చంద్రగ్రహణం ప్రపంచ వ్యాప్తంగా 18, 19 వ తేదీలలో కనిపించగా భారతదేశంలో మాత్రం 19వ తేదీ చంద్రగ్రహణం పాక్షికంగా ఏర్పడనుంది.
ఈ నెల 19వ తేదీ చంద్రగ్రహణం మధ్యాహ్నం 1:30 నుంచి పాక్షికంగా ఈశాన్య రాష్ట్రాలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మే 26న రాగ చివరి చంద్రగ్రహణం నవంబర్ 19వ తేదీ ఏర్పడినట్లు తెలుస్తోంది.ఈ చంద్రగ్రహణం ఈశాన్య రాష్ట్రాలతో పాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో దర్శనమివ్వనుంది.
ఇక ఉత్తర అమెరికాలోని 50దేశాలతో పాటు మెక్సికోలో కూడా చంద్రగ్రహణం ఏర్పడనుంది.
కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడే ఈ చంద్ర గ్రహణాన్ని ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు మంచుతో కప్పబడి ఉన్న చంద్రుడిని ఈ విధంగా పిలుస్తారు.
కనుక కార్తీక పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం ఉండటం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.ఇక కార్తీక పౌర్ణమి రోజున హిందూ ప్రజలు పెద్ద పండుగగా జరుపుకుంటారు.
ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను దర్శించి దీపాలను వెలిగించి స్వామివారి సేవలో పాల్గొంటారు.ముఖ్యంగా శివాలయాలు శ్రీహరి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.