అప్పుడే హామీ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్‌ నాటకాలాడుతున్నారు

తెలంగాణకు అన్యాయం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు అంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులెటరీ విస్తరణకు సంబంధించిన జీవో జారీ చేయడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.

 Revanth Reddy Comments On Telangana Cm Kcr About Pothireddypadu Water Issue, Ap-TeluguStop.com

ఉమ్మడి నల్లగొండ మరియు మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లబోతున్నట్లుగా ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు.

తాజాగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.

గతంలో జగన్‌, కేసీఆర్‌ భేటీ అయిన సందర్బంగానే పోతిరెడ్డి పాడు వ్యవహారం చర్చకు వచ్చి ఉంటుందని, ఆ సమయంలో ఓకే అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.న్యాయ పోరాటం అనేది కేవలం నాటకం మాత్రమే అని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదన్నాడు.

సీఎం ఈ విషయంలో ఇప్పటి వరకు పెద్దగా స్పందించక పోవడంతో తెలంగాణ ప్రభుత్వ తీరు అర్థం అవుతుందంటూ ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube