నిత్యం ఏదో ఒక చోట వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం.కొన్ని జంతువులు ఇళ్లల్లోకి ప్రవేశించడం, వీధులలో ఉన్న అంగడిలోకి ప్రవేశించడం.
అక్కడి వారి అందరిని భయభ్రాంతులకు గురి చేయడం మనం చూస్తూనే ఉంటాం.ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి నెట్టింట.
ఒక్కోసారి ఆ జంతువులు ప్రజలకు హాని కలిగిస్తూ ఉంటే, మరికొన్ని జంతువులు ఎటువంటి అపాయం తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి.
ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్లో( Uttar Pradesh ) ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.అది ఏమిటి అంటే.పోలీస్ స్టేషన్ కు ఒక అనుకొని అతిధిగా ఆవు వెళ్ళింది.
ఆవు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఉంటే బాగుండేది.కానీ.
, ఆ ఆవు ఏకంగా పోలీస్ స్టేషన్( Police station ) పై కప్పు పైకి వెళ్లి నిలబడింది.అంతేకాకుండా గంటల వ్యవధి అక్కడే ఉండిపోయింది.
ఇక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్ లో చోటు చేసుకుంది.నిజానికి అ ఆవు పోలీస్ స్టేషన్ పై కప్పు పై ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్థానికులు అందరూ ఆ పోలీస్ స్టేషన్ పై కప్పు వైపుగా విచిత్రంగా చూస్తుంటే.పోలీసులు ఏమైంది అంటూ అని బయటికి వచ్చి చూడగా., మేడపై ఉన్న ఆ ఆవును చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఇక ఆవు మెడ పైకి ఎలా వెళ్ళిందో ఎవరికి ఇప్పటి వరకు స్పష్టత లేదు.
కానీ., ఎలా దించాలో అర్థం కాక పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
మెల్లగా ఆ ఆవును కిందుకు తరిమే ప్రయత్నం చేయగా ఆవు భయంతో పోలీస్ స్టేషన్ పైకప్పు నుంచి పక్కనే ఉన్న ఒక ఇంటి డాబా మీదకు దూకేసింది.ఈ తరుణంలో ఆ ఆవుకు తీవ్ర గాయాలు అయ్యాయని అక్కడి స్థానికులు తెలిపారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.