టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గురించి మనందరికీ తెలిసిందే.రాజావారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.
ఈ సినిమా తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అవ్వడంతో పాటు హీరోగా భారీగా క్రేజ్ ని ఏర్పరుచుకున్నారు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు కిరణ్.
అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు.
ఇప్పటివరకు కిరణ్ అభవరం కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు.ఇకపోతే త్వరలోనే కిరణ్ అభవరం క అనే సినిమాతో( Ka Movie ) ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.ఈసారి ఈ కాస్త కొత్తదనం వైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది.
తాజాగా కిరణ్ అబ్బవరం పుట్టినరోజు( Kiran Abbavaram Birthday ) సందర్భంగా ఏఏఏ మల్టీప్లెక్స్ లో టీజర్ విడుదల అయ్యింది.స్టోరీలోని కొన్ని కీ ఎలిమెంట్స్ ని పరిచయం చేశారు కిరణ్.
అయితే ఇది కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ.ఎక్కడో సుదూర గ్రామీణ ప్రాంతంలో పోస్ట్ మ్యాన్ గా పని చేస్తుంటాడు ఒక యువకుడు.అతనికున్న అలవాటు ఉత్తరాలను తెరిచి చదవడం.
ఇది తప్పు అయినప్పటికీ మానుకోలేకపోతాడు.తనకు తెలిసిన మంచిని చేస్తూనే లోపల తెలియని చెడు ఒకటి పెరుగుతోందని గుర్తించలేకపోతాడు.దీంతో ఊళ్ళో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి.
హత్యలు మొదలవుతాయి.గ్రామ దేవతకు ముడిపడిన కొన్ని విషయాలు భయపెడతాయి.
అసలు క అంటే ఎవరు, ఈ మిస్టరీ ఎలా జరుగుతోంది, అతను వెతుకుతున్న రహస్యం ఏంటనేది తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.సస్పెన్స్, థ్రిల్, క్రైమ్ ఈ మూడు అంశాలను మిక్స్ చేస్తూ దర్శక ద్వయం సుజిత్ అండ్ సందీప్ ఈ సినిమాను రూపొందించారు.