ఈ రోజుల్లో చాలామంది సెల్ఫీల మోజులో పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.తాజాగా అమెరికాకు చెందిన 37 ఏళ్ల ఫొటోగ్రాఫర్ అమండా గల్లఘర్ (Amanda Gallagher) సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదంలో పడి చనిపోయింది.
కాన్సాస్ రాష్ట్రంలోని విచిటాలో ఎయిర్ కాపిటల్ డ్రాప్ జోన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.శనివారం, విమానాల నుంచి ప్రజలు ఎక్కి దిగుతున్న దృశ్యాలను ఫోటోలు తీయడం మొదలుపెట్టింది.
సెల్ఫీలు( selfies) కూడా తీసుకోవడం స్టార్ట్ చేసింది.అప్పుడు ప్లేన్ రన్నింగ్ లోనే ఉంది.
దాని ప్రొపెల్లర్ వేగంగా తిరుగుతోంది.అయితే ఆ మహిళ ప్రొపెల్లర్‌పై పొరపాటున జారిపడింది.
మధ్యాహ్నం 2:40 గంటలకు ఆమెకు తీవ్రగా గాయాలు అయ్యాయని లెఫ్టినెంట్ ఎరిక్ స్లే ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.అమండాను వెంటనే దగ్గరి ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారని స్థానిక న్యూస్ ఛానెల్ తెలిపింది.ఎయిర్ కాపిటల్ డ్రాప్ జోన్ (Air Capital Drop Zone)అనే స్కైడైవింగ్ కంపెనీ ప్రకారం, అమండా (Amanda)విమానం రెక్క ముందుకు వెళ్లి, ప్రాథమిక భద్రతా నియమాలను ఉల్లంఘించింది.ఫొటోలు తీయడానికి కెమెరాను పైకి ఎత్తి, కొంచెం వెనక్కి తగ్గి, తిరుగుతున్న ప్రొపెల్లర్‌కు తగిలింది.
ఈ ప్రమాదాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) కలిసి విచారిస్తున్నట్లు సోమవారం తెలిపాయి.
ప్రతిభావంతురైన ఫొటోగ్రాఫర్ అమండా(Amanda) చిన్న వయసులోనే మరణించడంతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.అమండాకు జరిగిన ప్రమాదంలో ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ఒక గోఫండ్‌మీ క్యాంపెయిన్ ప్రారంభించారు.ఇప్పటికే 14,000 డాలర్లకు పైగా సేకరించారు.
ఈ క్యాంపెయిన్‌లో అమండా చాలా దయగల, సాహసమైన, సృజనాత్మకమైన వ్యక్తి అని, చాలా అందంగా ఉండేవారని వర్ణించారు.ఆమె లేని లోటు ఎంతో బాధిస్తోందని కూడా తెలిపారు.
అమండా తనకు ఇష్టమైన పని అయిన స్కైడైవింగ్ చేస్తూ ఫోటోలు తీస్తుండగా అక్టోబర్ 26న ఒక దురదృష్టవంతమైన ప్రమాదంలో మరణించారని తెలిపారు.ఆమె కుటుంబం తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది.
అంత్యక్రియల ఖర్చుల కోసం వారికి సహాయం అవసరం.ప్రజలందరూ దానం చేయాలని, ఆమె కుటుంబాన్ని ప్రార్థించాలని ఈ క్యాంపెయిన్‌లో కోరారు.