చైనాకు చెందిన క్షీ(Xie) అనే మహిళ చేసిన ఓ పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది.తాజాగా ఆమె థాయిలాండ్‌లో పట్టుబడింది.ఈమె దాదాపు రూ.1.77 కోట్లకు పైగా మోసం చేసిందని ఆరోపించారు.ఈ మహిళ రెండేళ్లకు పైగా పోలీసులనుంచి తప్పించుకొని తిరుగుతోంది.
ఆమె ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం( Airline Job) ఇప్పిస్తానని చెప్పి చాలా మందిని మోసం చేసింది.ఎవరైనా ఆమెకు డబ్బు ఇస్తే వారికి మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేది.
ఇలా 2014 నుంచి మోసాలు చేస్తూ వస్తోంది.ముఖ్యంగా 2016 నుంచి 2019 వరకు చాలా మందిని మోసం చేసింది.ఆమెకు పెద్ద ఎయిర్‌లైన్‌లతో సంబంధాలు ఉన్నాయని నమ్మించి కనీసం ఆరుగురిని మోసం చేసింది.
30 ఏళ్ల క్షీ అనే మహిళ, తాను ధనవంతురాలైన ఫ్లైట్ అటెండెంట్ అని నటిస్తూ చాలా మందిని మోసం చేసింది.తన మాటలు నిజమే అని నమ్మించడానికి వివిధ దేశాల ఫొటోలను చూపించేది.ఆమె మోసగించిన వారిలో ఆమె సొంత బంధువు కూడా ఉంది.క్షీ(Xie), తన స్నేహితుడికి జపాన్‌లో గడియారం కొనడానికి డబ్బు అవసరమని చెప్పి, తన బంధువు నుంచి 6 లక్షల రూపాయలకు సమానమైన డబ్బు అప్పు తీసుకుంది.తిరిగి ఇస్తానని చెప్పింది కానీ ఇవ్వలేదు.
దీంతో ఆమె బంధువు చాలా నష్టపోయింది.
![Telugu Chinese, Fraud, Interpol, Plastic Surgery, Thailand, Visa-Telugu NRI Telugu Chinese, Fraud, Interpol, Plastic Surgery, Thailand, Visa-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/10/A-Chinese-woman-who-stole-coats-in-the-guise-of-a-flight-attendant-a.jpg)
పట్టుబడకుండా ఉండడానికి క్షీ తన ముఖాన్ని మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.ఈ సర్జరీకి డబ్బు మోసం చేసిన డబ్బు నుండే వెచ్చించిందని వార్తలు వచ్చాయి.బ్యాంకాక్‌లో క్షీ(Kshi ,Bangkok) ఎప్పుడూ తన ముఖాన్ని కప్పుకుని మాస్కులు వేసుకుని తిరగడం చూసి స్థానికులు అనుమానించారు.
ఆమె అక్రమంగా దేశంలో ఉన్నదేమో అని అనుకుని పోలీసులకు చెప్పారు.
![Telugu Chinese, Fraud, Interpol, Plastic Surgery, Thailand, Visa-Telugu NRI Telugu Chinese, Fraud, Interpol, Plastic Surgery, Thailand, Visa-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/10/A-Chinese-woman-who-stole-coats-in-the-guise-of-a-flight-attendant-b.jpg)
క్షీ అక్టోబర్ 7న తన అపార్ట్‌మెంట్ నుంచి ఆహారం తీసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు థాయిలాండ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.విచారణ సమయంలో ఆమె దగ్గర గుర్తింపు కార్డు లేదని తేలింది.అంతేకాకుండా, 2022 చివరలో థాయిలాండ్‌కు వచ్చిన తర్వాత తన టూరిస్ట్ వీసా గడువు దాటి 650 రోజులకు పైగా అక్కడే ఉందని తెలిసింది.
చైనా పోలీసులు ఆమెను మోసం కేసులో అరెస్ట్ చేయాలని చూస్తున్నందున ఇంటర్‌పోల్ ఆమెపై నోటీసు జారీ చేసిందని తెలిసింది.థాయిలాండ్ అధికారులు మొదట క్షీ వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్షిస్తామని చెప్పారు.
ఆ తర్వాత ఆమెను చైనాకు తిరిగి పంపిస్తారు.అక్కడ ఆమె చేసిన మోసాలకు శిక్ష పడుతుంది.