చలికాలంలో పచ్చి బఠానీలు ఎందుకు తినకూడదు.. తింటే ఏమవుతుంది?

చలికాలంలో ప్రకృతి అందరూ ఎంత సుందరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చలికాలాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు.

 Why Not Eat Green Peas In Winter, Green Peas, Green Peas Health Benefits ,-TeluguStop.com

అయితే చలికాలం ఆహ్లాదకరంగానే కాదు అజాగ్రత్తగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.మ‌న‌శ్శాంతిని దూరం చేస్తుంది.

అందుకే హెల్త్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా చ‌లికాలంలో కొన్ని కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు.

మరి ఆ కొన్ని కొన్ని ఆహారాలు ఏవేవో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Telugu Green Peas, Greenpeas, Tips, Salads-Telugu Health

పచ్చి బఠానీలు.( Green peas ) చాలా మంది వీటిని లైక్ చేస్తారు.బఠానీలు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో విలువైన పోషకాలతో నిండి ఉంటాయి.

ముఖ్యంగా శాకాహారులు ప్రోటీన్ కోసం వీటిని కచ్చితంగా డైట్ లో చేర్చుకుంటారు.కానీ చలికాలంలో మాత్రం పచ్చి బఠానీలు తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే చలికాలంలో పచ్చి బఠానీలు స్టార్చ్ ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి.అందువల్ల వీటిని ఈ సీజన్ లో తీసుకుంటే తొందరగా బరువు పెరుగుతారు.

( Weight gain )అలాగే సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కానీ చలికాలంలో సలాడ్స్ ను ఎవైడ్ చేయడమే ఉత్తమం.

ఎందుకంటే వింటర్ లో జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది.అందువల్ల సలాడ్స్ ను తీసుకుంటే త్వరగా జీర్ణం అవ్వవు.

జీర్ణక్రియ పై అధిక ఒత్తిడి పడుతుంది.ఈ క్రమంలోనే కడుపు ఉబ్బరం అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

Telugu Green Peas, Greenpeas, Tips, Salads-Telugu Health

మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఎందుకంటే చలికాలంలో అవి మన ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. జలుబు, దగ్గు వంటి ( Cold cough )సమస్యలను తెచ్చి పెడతాయి.ఇక ప్రాసెస్ చేసిన మాంసం, పండ్ల రసాలు, స్వీట్స్ వంటి ఆహారాలను కూడా ఈ వింట‌ర్ సీజ‌న్ లో దగ్గరకు రానివ్వక‌పోవ‌డ‌మే చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube