పచ్చి కొబ్బరి( Raw coconut ).తినడానికి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
రుచితో పాటు పచ్చి కొబ్బరిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఈ.ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.నిత్యం పచ్చి కొబ్బరిని తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య లాభాలు పొందవచ్చు.అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా పచ్చి కొబ్బరి ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి పచ్చి కొబ్బరి ఒక వరమనే చెప్పవచ్చు.పచ్చి కొబ్బరిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ ముఖ చర్మం తెల్లగా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం స్కిన్ వైట్నింగ్ కి పచ్చికొబ్బరిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు లేత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్టు లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే సహజంగానే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
మార్కెట్లో వేలకు వేలు ఖరీదు చేసే క్రీమ్స్, సీరమ్స్ కంటే అద్భుతంగా స్కిన్ వైట్నింగ్ కు ఈ రెమెడీ ఉపయోగపడుతుంది.పైగా ఈ రెమెడీ వల్ల చర్మ మృదువుగా కోమలంగా మారుతుంది.
స్కిన్ పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.







