ఉలవలు. ( Horse Gram )వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.ఒకప్పుడు ఉలవలను ప్రతి ఒక్కరూ విరివిరిగా వాడేవారు.కానీ ప్రస్తుత రోజుల్లో వీటి వినియోగం బాగా తగ్గింది.ఉలవల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి.అందుకే అవి ఆరోగ్యపరంగా మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా ఉలవలతో జావ లేదా ఉడికించిన ఉలవలను ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు

ఉలవ జావ విషయానికి వస్తే.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అర లీటర్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Grate ginger ) పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి,( Pepper powder ) పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మరిగించాలి.ఈ లోపు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉలవ పిండిని వేసుకుని వాటర్ తో స్మూత్ పేస్ట్ లా కలుపుకోవాలి.
స్టవ్ పై పెట్టిన వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ ఉలవ పిండి మిశ్రమాన్ని అందులో వేసి గరిటెతో తిప్పుకుంటూ ఉడికించాలి.
దాదాపు పది నిమిషాల పాటు ఉడికిస్తే మన జావ సిద్ధం అవుతుంది.
ఈ ఉలవ జావ ఉదయం లేదా సాయంత్రం వేళలో అయినా తీసుకోవచ్చు.జావ తాగలేమనే వారు రోజుకు ఒక కప్పు ఉడికించిన ఉలవలను తినండి.
ఇలా ఎలా తీసుకున్నా మంచిది.నిత్యం ఉలవ జావను తీసుకుంటే ఎముకల్లో దృఢత్వం పెరుగుతుంది.
వయసు పైబడిన సరే మోకాళ్ళ నొప్పులు, కీళ్లు పట్టేయడం వంటివి దరిచేరకుండా ఉంటాయి.

అలాగే ఈ ఉలవల జావ వెయిట్ లాస్( weight loss ) కు అద్భుతంగా సహాయపడుతుంది.పొట్ట కొవ్వును కరిగిస్తుంది.బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తుంది.రక్తహీనతను తరమి కొడుతుంది.
మెదడు పనితీరును మునుపటి కంటే చురుగ్గా మారుస్తుంది.మరియు రక్త పోటును సైతం అదుపులో ఉంచుతుంది.