Weight Loss Fruits: చ‌లి కాలంలో ఈ పండ్లు తింటే బ‌రువు పెర‌గ‌రు.. తెలుసా?

ప్రస్తుత చలికాలంలో బద్ధకం అనేది విపరీతంగా ఉంటుంది.బద్ధకం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామాలు చేయడానికి ఏ మాత్రం మొగ్గు చూపలేకపోతుంటారు.

 If You Eat These Fruits In Cold Season You Will Not Gain Weight Details! Fruits,-TeluguStop.com

ఫలితంగా బరువు పెరుగుతారు.ఇక బ‌రువు పెరిగితే శరీర ఆకృతి దెబ్బ తినడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టుముట్టేస్తాయి.

అయితే ఇప్పుడు చెప్పబోయే పండ్లు డైట్ లో చేర్చుకుంటే చలి కాలంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

అంజీర్.ఈ పండ్లు ప్రస్తుతం దాదాపు అన్ని చోట్ల విరివిరిగా లభ్యమవుతున్నాయి.చలికాలంలో రోజుకు ఒక అంజీర్ పండును కనుక తీసుకుంటే శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.మెటబాలిజం రేటు పెరిగితే క్యాలరీలు అద్భుతంగా కరుగుతాయి.

ఫలితంగా బరువు పెరగడం కాదు తగ్గుతారు.

స్టార్ ఫ్రూట్.

చలికాలంలో ఖ‌చ్చితంగా తినాల్సిన పండ్ల‌లో ఇది ఒకటి.స్టార్ ఫ్రూట్ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.

స్టార్ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది దాంతో చిరు తిండ్ల‌పై మనసు మల్లకుండా ఉంటుంది.

ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు.

Telugu Anjeer, Fruits, Guava, Tips, Orange-Telugu Health

చలికాలంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి అని భావించేవారు తప్పకుండా త‌మ డైట్ లో జామ పండ్ల‌ను చేర్చుకోండి.రోజుకు ఒక జామ పండును తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషక విలువ‌లు వెయిట్ ను కంట్రోల్ చేస్తాయి.ఇమ్యూనిటీ సిస్టంను సూప‌ర్‌ స్ట్రాంగ్ గా మారుస్తాయి.

మరియు సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట సైతం వేస్తాయి.ఇక సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఆరెంజ్ శరీర బరువును అదుపు చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.పైగా ఎన్నో ఆరోగ్య లాభాల‌ను సైతం అందిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube