పాలు, పెరుగు అంటే మీకు అస్సలు పడవా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!

సాధారణంగా కొందరికి జంతువుల పాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.పాలు మాత్రమే కాదు పాల ద్వారా వచ్చే పెరుగు, మజ్జిగ, పన్నీర్( Curd, buttermilk, paneer ) వంటి ఉత్పత్తులను కూడా పూర్తిగా ఎవైడ్ చేస్తుంటారు.

 This Is The Best Alternative To Milk! Vegan Milk, Animal Milk, Coconut, Peanuts,-TeluguStop.com

మీకు కూడా జంతువుల పాల ఉత్పత్తులు అస్స‌లు పడవా.అయితే మీరు ఖచ్చితంగా వాటికి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

అందుకు ఇప్పుడు చెప్పబోయే మిల్క్ చాలా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవాలి.మరి ఆ మిల్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగలు( Peanuts ) వేసి స్లైట్ గా వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న వేరుశనగలను శుభ్రంగా పొట్టు తొలగించుకుని పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తొలగించిన వేరుశనగలతో పాటు ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుము( Grate coconut ) వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి పాలును సపరేట్ చేసుకోవాలి.

Telugu Animal Milk, Coconut, Curd, Tips, Latest, Milk, Peanuts, Vegan, Vegan Mil

ఈ పాలను వేగన్ పాలు( Vegan milk ) అని అంటారు.ఈ వేగన్ పాలు జంతువుల నుంచి సేకరించిన పాల వలే ఆకృతి, రుచి, లక్షణాలను పోలి ఉంటాయి.ఈ పాలు గిన్నెలో పోసుకుని మరుగుతున్న నీటిలో ఉంచి బాయిల్ చేయాలి.ఇలా డబుల్ బాయిలర్ మెథడ్ ( Double boiler method )లో కాచిన పాలను రోజూ ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

పాలు, పెరుగును కంప్లీట్ గా దూరం పెట్టే వారిలో ప్రోటీన్ కొరత అనేది ఎక్కువగా ఉంటుంది.అయితే ఈ వేగన్ మిల్క్ ను రోజు కనుక తీసుకుంటే ప్రోటీన్ కొరత అనేది ఉండదు.

Telugu Animal Milk, Coconut, Curd, Tips, Latest, Milk, Peanuts, Vegan, Vegan Mil

అలాగే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ బి ఇలా ఎన్నో పోషకాలు వేగన్ మిల్క్ లో ఉంటాయి.ఈ వేగన్ మిల్క్ ను రెగ్యులర్ గా తీసుకుంటే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.ఎముకలు దృఢంగా మారతాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దీంతో గుండె ఆరోగ్యంగా మారుతుంది.అంతేకాదు ఈ వేగన్ మిల్క్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

చర్మం యవ్వనంగా మెరుస్తుంది .ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.మరియు మధుమేహం వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube