అధిక రక్తపోటు.( High BP ) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి.
అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, మధ్యపానం ధూమపానం అలవాట్లు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు.
తలనొప్పి, వికారం, ముక్కు నుండి రక్తం కారడం, అస్పష్టమైన దృష్టి, తల తిరగడం, ఛాతిలో నొప్పి, శ్వాస ఆడకపోవడం ఇవన్నీ అధిక రక్తపోటు యొక్క లక్షణాలు.అయితే అధిక రక్తపోటును అదుపులోకి తెచ్చుకునేందుకు కొందరు నిత్యం మందులు వాడుతుంటారు.
కానీ యాలకులు( Cardamom ) అధిక రక్తపోటుకు సహజ ఔషధంగా పని చేస్తాయి.
యాలకుల్లో ఉండే పలు సుగుణాలు రక్తపోటును అదుపులోకి తేవడానికి అద్భుతంగా తోడ్పడతాయి.
అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి.వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

ఈ యాలకుల నీటిని( Cardamom Water ) నిత్యం తీసుకుంటే కనుక అధిక రక్తపోటు అన్న మాటే అనరు.ఈ యాలకుల నీరు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచడానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.పైగా ఈ యాలకుల నీరును నిత్యం తాగడం వల్ల మరెన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

యాలకుల వాటర్ మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది.యాలకులు మరిగించిన వాటర్ ను రోజు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ ( Cancer ) వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు దంపతుల్లో సంతాన సమస్యలను సైతం దూరం అవుతాయి.