రకరకాల కారణాలతో హీరోలు కొన్ని సినిమాలను వదులుకుంటారు.కొందరు డేట్లు అడ్జెస్ట్ కాక వదిలేస్తే.
మరికొందరు కథ నచ్చక లైట్ తీసుకుంటారు.మరొకరు మార్పులకు ఒప్పుకోకపోవడంతో రిజెక్ట్ చేస్తారు.
ఏవేవో కారణాలతో వదులుకున్న సినిమాలు.మరో హీరో చేతికి వెళ్లి బంఫర్ హిట్ అయితే.
అనవసరంగా వదులుకున్నామే అని తీరిగ్గా బాధపడతారు.ఏదేతేనేం.
ఆయా కారణాలతో పలు హిట్ సినిమాలను చేజార్చుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఈ కథని తొలుత డైరెక్టర్ సందీప్ రెడ్డి.హీరో అల్లు అర్జున్ కి చెప్పడానికి ప్రయత్నించాడు .కానీ కుదరలేదు.ఆ తర్వాత శర్వానంద్ కి చెప్పాడు.
అతనికి కథ నచ్చినా.తన ఇమేజ్ కి సరిపోదని రిజెక్ట్ చేసాడు .ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బంఫర్ హిట్ కొట్టిండు.
సింహాద్రి
జూనియర్ ఎన్టీ ఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి.విజయేంద్ర ప్రసాద్ ఈ కథని బాలకృష్ణ కోసం రాసాడట .కొన్ని కారణాలతో రాజమౌళి తారక్ ను అప్రోచ్ అయ్యాడు, సినిమా చేశాడు.సూపర్ హిట్ కొట్టాడు.
ఠాగూర్
ఈసినిమా అవకాశం ముందుగా రాజశేకర్ కు వచ్చింది.కానీ చివరి నిమిషంలో చిరంజీవి చేశాడు.అందుకే వీరిద్దరి మధ్య గొడవలు అయ్యాయనే వార్తలొచ్చాయి.
ఇడియట్
పూరీ, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.ఈ సినిమాను పూరీ పవన్ కళ్యాణ్ కి వినిపించాడు.పవన్ డేట్స్ కుదరక రవితేజ తో చేశాడు.
తొలిప్రేమ
పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీ.ఈ స్టోరీని డైరెక్టర్ కరుణాకర్ ముందు సుమంత్ కి చెప్పాడు.అతడు రిజెక్ట్ చేయడంతో పవన్ ముందుకు వచ్చింది.
చంటి
విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా ఓ మైల్ స్టోన్.తొలుత ఈ సినిమాను రాజేంద్రప్రసాద్ రీమేక్ చేయాలి అనుకున్నాడట.అయితే వెంకటేష్ ఆపని ముందుగా చేశాడు.
దిల్-ఆర్య-ఎవడు
వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన దిల్ , సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య, ఎవడు సినిమాలు మొదట జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సినవి కానీ కాల్షీట్లు కుదరలేదంట.దిల్ నితిన్ తో, ఆర్య అల్లు అర్జున్ తో , ఎవడు రాంచరణ్ తో చేసి సూపర్ హిట్ కొట్టారు .
బాహుబలి
ఈ సినిమాని మొదట రాజమౌళి బాలీవుడ్ హీరోలతో చేయాలనుకున్నాడట.వారి ద్వారా మార్కెట్ సులువవుతుందనుకున్నాడు.కానీ తర్వాత ప్రభాస్ తో చేసి ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు కొట్టాడు .
కొత్త బంగారులోకం
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చినఈ సినిమాను మొదట నాగ చైతన్యకు వినిపించారు.ఆయనకు కథ నచ్చక వదిలేశాడు.వరణ్ హిట్ కొట్టాడు.
శతమానం భవతి
శర్వానంద్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమా రాజ్ తరుణ్ తో చేయాల్సి ఉంది.కానీ దిల్ రాజుతో తనకు గొడవలు ఉండటంతో శర్వానంద్ చేశాడు.
.