టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu Arjun ) కు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల జరిగిన డ్యామేజ్ అంతాఇంతా కాదు.రేవతి ఈ ఘటనలో మృతి చెందగా రేవతి కొడుకు శ్రీతేజ్ కు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో వైద్యం అందుతోంది.మొదట శ్రీతేజ్ కు బన్నీ 25 లక్షల రూపాయల సాయం ప్రకటించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని కోటి రూపాయలకు పెంచడం గమనార్హం.
పుష్ప2 నిర్మాతలు 50 లక్షల రూపాయలు, మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )నిర్మాతలు 50 లక్షలు ఇవ్వనునున్నారని తెలుస్తోంది.2 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించిన నేపథ్యంలో బన్నీపై మేకర్స్ కు కోపం తగ్గినట్టేనా అనే చర్చ జరుగుతోంది.బన్నీపై నమోదైన కేసు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
దిల్ రాజు ఎంట్రీతో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ కు ఈ వివాదాల వల్ల కలిగిన నష్టం అంతాఇంతా కాదు. ఒకరోజు జైలు జీవితం అనుభవించిన బన్నీ తాజాగా పోలీస్ స్టేషన్ లో విచారణకు సైతం హాజరయ్యారు.మరోవైపు రేవతి ఊపిరాడక మృతి చెందిందనే ప్రచారం జరుగుతోంది.
ఆమె శరీరంపై గాయాలు లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అల్లు అర్జున్ క్రేజ్ కొంతమేర తగ్గిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.బన్నీ భవిష్యత్తు సినిమాలు వివాదాలకు దూరంగా ఉండే కాన్సెప్ట్ లతో తెరకెక్కాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బన్నీ క్రేజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుంది.అల్లు అర్జున్ తర్వాత సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.