ఒకప్పుడు ఆమె ఎత్తును( Height ) చూసి అవహేళన చేసిన, నవ్వినవాళ్లే ఇప్పుడు ఆమెను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.యునైటెడ్ కింగ్‌డమ్‌కి( UK ) చెందిన 36 ఏళ్ల డోనా రిచ్,( Donna Rich ) తన అసాధారణ ఎత్తు (6 అడుగుల 1 అంగుళాలు) ఒకప్పుడు తన బలహీనత అనుకుంది.
కానీ ఇప్పుడు అదే ఆమెకు బలంగా మారింది.తన ఎత్తునే పెట్టుబడిగా పెట్టి, కోట్లు సంపాదిస్తోంది.
ఎలా అనుకుంటున్నారా?
మూడేళ్ల క్రితం వరకు థెరపిస్ట్‌గా పనిచేసిన డోనా, తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది.టిక్‌టాక్( TikTok ) లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ క్రియేటర్‌గా కొత్త అవతారం ఎత్తింది.
తన పొడవైన ఎత్తునే తన ప్రత్యేకతగా మార్చుకుని, వీడియోలు చేయడం మొదలుపెట్టింది.ముఖ్యంగా పొట్టిగా ఉండే పురుషులు, పొడవైన స్త్రీలను ఇష్టపడేవాళ్లు ఆమె ఫాలోవర్స్‌గా మారారు.డోనా తన ఫాలోవర్స్‌కి నచ్చే కంటెంట్‌ను క్రియేట్ చేస్తూ, ఇప్పుడు మిలియనీర్‌గా మారింది.
డోనా రిచ్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, చాలా మంది పొట్టిగా ఉన్న పురుషులు పొడవైన మహిళలంటే ప్రత్యేక ఆసక్తి చూపుతారని, అలాంటి కంటెంట్ కోసం డబ్బులు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పింది.ఈ కారణంగానే ఆమె ఆర్థికంగా బాగా సంపాదించగలిగింది.ఇప్పటివరకు ఆమె దాదాపు రూ.6 కోట్లు సంపాదించింది.దాంతో ఆమె త్వరగా రిటైర్ అవ్వాలనే ఆలోచన కూడా చేస్తోంది.
ఆర్థిక భద్రతతో వచ్చే ప్రశాంతతతో పాటు విహారయాత్రలు లాంటి విలాసాలను కూడా డోనా ఆస్వాదిస్తోంది.
హీల్స్ వేసుకుంటే డోనా 6 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో అద్భుతంగా కనిపిస్తుంది.ఒకప్పుడు తన పొడవే తనకి శాపం అనుకుంది, స్నేహితుల్లో ఒంటరిగా ఫీలయ్యేది.కానీ ఇప్పుడు అదే తన బలం! డిజిటల్ ప్రపంచంలో మీ ప్రత్యేకతే మీ పెట్టుబడి అని డోనా నిరూపించింది.
మీ బలహీనతనే బలంగా మార్చుకుంటే, డోనా లాగే మీరు కూడా సక్సెస్ అవ్వొచ్చు.