ఆరోగ్యానికి మంచిదని ఆవనూనె వాడుతున్నారా? అయితే కచ్చితంగా ఇవి తెలుసుకోండి!

ఆవ నూనె( Mustard oil ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 Side Effects Of Mustard Oil! Mustard Oil Side Effects, Mustard Oil, Latest News,-TeluguStop.com

ఆవాల నుంచి తయారు చేసే ఈ నూనె ఘాటైన సువాసన కలిగి ఉంటుంది.ఖరీదు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి మంచిది అన్న కారణంతో ఆవ నూనెను వంటలకు విరివిరిగా వాడుతున్నారు.ఆవ నూనెలో.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

అందుకే ఆవ నూనె ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ ఆవ నూనెను అధికంగా వాడితే మాత్రం సమస్యల‌ను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.అవును, ఆవనూనెను అతిగా వాడటం వల్ల ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.ఎరుసిక్ యాసిడ్ అనేది కూరగాయల నూనెలలో కనిపించే కొవ్వు ఆమ్లం.ఇది గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను పెంచుతుంది.ఆవనూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.ఆవ నూనెను నిరంతరం వాడటం వల్ల తరచూ తలనొప్పి( Headache ), వాంతులు, కాళ్ల వాపు వంటి సమస్యలు ఏర్పడతాయి.

గర్భిణీలు అయితే ఆవ నూనెను కంప్లీట్ గా ఎవైడ్ చేయాలి.ఎందుకంటే ఆవ నూనె గర్భస్రావానికి కారణం అవుతుంది.ఆవనూనెలో ఉండే ఎరుసిక్ యాసిడ్ ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది.

దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర శ్వాస సంబంధిత సమస్యలు( Breathing problem ) ఏర్పడతాయి.అందుకే ఆవ నూనెను నిరంతరం ఉపయోగించడం మానుకోండి.

కనీసం మూడు నెలలకు ఒకసారి వంట నూనెను మారుస్తూ ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube