1.తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభ తేదీ ఖరారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది.ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది.
2.కర్ణాటక పర్యటనకు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోది ఈనెల 12న మరోసారి కర్ణాటక పర్యటనకు వెళ్లనున్నారు.
3.విశాఖలో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
4.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
5.ఎమ్మెల్సీ కవిత దీక్ష
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగారు.
6.సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్లారు .
7.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే సీఎం
2024 ఎన్నికల్లో టిడిపి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.
8.ధరణి పోర్టల్ తొలగించాలి : భట్టు
సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే వెంటనే ధరణి పోర్టల్ ను తొలగించాలని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క అన్నారు.
9.బిజెపి దీక్ష ప్రారంభం
బిజెపి కార్యాలయంలో మహిళా కోస బిజెపి భరోసా దీక్షను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు.
10.వైసిపి పై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.ఇది రాక్షస ప్రభుత్వం అని , సిఐడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
11.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈనెల 14న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
12.నేడు ఫైర్ డిజిగా బాధ్యతలు చేపట్టనున్న సునీల్ కుమార్
నేడు ఫైర్ డిజిగా మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
13.సిపిఎస్ రద్దు చేయాలంటూ ధర్నా
నేడు సిపిఎస్ రద్దు చేయాలని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
14.ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పర్యటన
నేడు వినుకొండలో ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించనున్నారు.
15.కెసిఆర్ అధ్యక్షతన బీ ఆర్ ఎస్ సమావేశం
ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ జరగనుంది.
16.తేజస్వి యాదవ్ నివాసంలో ఈడి సోదాలు
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జెడి అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల కేసులో ఈడి సోదాలు చేపట్టింది.ఈ సోదాల్లో లాలూ కుమారుడు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇంటిని తనిఖీ చేశారు.
17.కవితకు బండి సంజయ్ సవాల్
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయని, బీఆర్ఎస్ నేత వేధింపుల వలన ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.తెలంగాణ క్యాబినెట్ లో మూడు శాతం మహిళా మంత్రులు కూడా లేరని, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఈరోజు కవిత ఢిల్లీలో ధర్నాకు దిగడం సిగ్గుచేటని సంజయ్ విమర్శించారు.
18.రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించినట్లు ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ వెల్లడించారు.
19.కేటీఆర్ కు వెంకటరెడ్డి సవాల్
బిజెపిలో చేరేందుకు తనకు 18 వేల కోట్లు కాంట్రాక్టు ఇచ్చారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.దమ్ముంటే కేటీఆర్ దీనిని నిరూపించాలని ఆయన సవాల్ చేశారు.
20.నష్టాలు దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
21.జగన్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతుందని సీఎం జగన్ మాటల్లో కాదు , చేతల్లో చూపిస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారెడ్డి అన్నారు.
22.ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఊహించని పరిణామం ఎదురయ్యింది.ఈడి కి ఇచ్చిన వాంగ్మూలం ను వెనక్కి తీసుకునేందుకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
23.కవిత పై షర్మిల విమర్శలు
మహిళా బిల్లులపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీ లో కాదు కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయాలని షర్మిల విమర్శలు చేశారు.
24.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,400
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56,070
.