ఎన్ని కేసులయినా పెట్టుకోండి ... అనిల్ కుమార్ హెచ్చరిక

ఏపీ లోని అధికార  కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి,  వైసిపి కీలక నేత అనిల్ కుమార్( Anil Kumar ) తీవ్ర హెచ్చరికలు చేశారు.  జగన్ ను( Jagan ) మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తున్నామని,  రాష్ట్రంలో వైసిపికి( YCP ) పునర్ వైభవం తీసుకువస్తామని అన్నారు.

 Ycp Anil Kumar Yadav Comments On Ycp Leaders Arrests Details, Tdp, Janasena, Bjp-TeluguStop.com

చాలా రోజులుగా అనిల్ కుమార్ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల పైన ఆయన ఘాటుగా స్పందించారు.  నేను పార్టీ మారుస్తున్నాను అంటూ కొన్ని చానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని,  నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ జగన్ వెంటే ఉంటానని , వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ చేసేలా తన వంతు కృషి చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Telugu Jagan, Janasena, Nellore, Tdp Alliance, Ycp, Ysjagan-Politics

నా మీద తప్పుడు కథనాలు రాసి వ్యూస్ పెంచుకుందామని కొన్ని చానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని,  నామీద వార్త రాయడం వల్ల చానెల్స్ రేటింగ్ పెరుగుతాయి అంటే రాసుకోవచ్చని సూచించారు.తాను కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నానని , త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని , నాన్ స్టాప్ గా పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్టు చేయాలంటూ కొంతమంది వ్యక్తులు లోకేష్ వెంట తిరుగుతున్నారని,  అధికారం చేతిలో పెట్టుకుని నాపై అక్రమ కేసులు పెట్టించి శునకా ఆనందం పొందాలని చూస్తున్నారు.

Telugu Jagan, Janasena, Nellore, Tdp Alliance, Ycp, Ysjagan-Politics

ఎన్ని కేసులైన పెట్టుకోండి భరిస్తా.మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా.  ఎవరు పోస్టింగ్ పెట్టిన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేస్తూ కూటమి ప్రభుత్వం శునకానందం పొందుతోంది.

  నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు.ఇక్కడ భయపడేవారు ఎవరు లేరు.  గతంలో మా ప్రభుత్వంలో మేము ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కేసులు అయ్యేవి.కానీ మేము అలా చేయలేదు.

రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరేగా ఉంటాయి.అరెస్టులపై కూటమినేతలు మాకు ఒక దారి చూపించారు అంటూ అనిల్ కుమార్ మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube