మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..

మనం పూల కోసం, ఇంటి అందం కోసం రకరకాల పూల మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటాము.అయితే మనం అందం కోసం పెంచుకునే మొక్కలలో మన ఆయుషుని పెంచే మొక్క కూడా ఒకటి ఉంది.

 If You Want To Be Healthy Grow This Plant At Home , Plant At Home,flower Plants-TeluguStop.com

అదే వాము ఆకు మొక్క.ఈ మొక్క చాలా మందికి తెలిసి ఉంటుంది.దీనితో పచ్చడి చేస్తూ ఉంటారు.అలాగే బజ్జీలు కూడా వేసుకుని తింటూ ఉంటారు.

ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు.ఈ మొక్కల్ని నర్సరీలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు.

ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి.దీని ఆకులు చాలా మందంగా ఉంటాయి.

ఈ మొక్కకు నీరు ఎక్కువ అవసరం ఉండదు.ఈ మొక్కలోని ఒక కాడను తెంపి భూమిలోకి నాటితే అది పెద్ద మొక్కగా పెరుగుతుంది.

ఇది సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.ఇది ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంట్లోని గాలి వచ్చే చోట పెడితే, ఈ మొక్క నుంచి వచ్చే గాలి పరిమళాలతో వస్తూ ఉంటుంది.

దీనిని పీల్చడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచి ఫలితం ఉంది.

Telugu Ayurvedam, Flower, Tips, Nursery, Pregnant-Telugu Health

ఈ వాము ఆకులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మాత్రం వీడిని తినిపించకూడదు.గర్భిణీ స్త్రీలు ఈ ఆకులను వాడితే గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

లేదంటే పుట్టి బిడ్డకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంది.ఈ వాము ఆకులో ఫైబర్ అధికంగా ఉంటుంది.

కాబట్టి ఎలా శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది.ఈ వామకుల్ని ప్రతి రోజు వాడే వారికి దగ్గు, జలుబు అసలు రావు.

ఒక వేళ వస్తే పది వాము ఆకుల్ని కడిగి వేడి నీటిలో మరిగించి ఆ నీరు మూడోవంతు వరకు తగ్గాక ఒడగట్టి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube