17 ఏళ్ల భారతీయ బాలిక కామ్య కార్తికేయన్(Kamya Karthikeyan) సరికొత్త చరిత్ర సృష్టించింది.ఏడు ఖండాల్లోని(7continents) అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన యంగెస్ట్ ఫిమేల్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పింది.
డిసెంబర్ 24న అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్(Kamya Karthikeyan) శిఖరాన్ని జయించడంతో ఈ ఫీట్ సాధించింది.ఈ ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’లో కామ్యతో పాటు ఆమె తండ్రి, కమాండర్ ఎస్.కార్తికేయన్ కూడా పాల్గొనడం విశేషం.
ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో చదువుతున్న కామ్య ఈ అచీవ్‌మెంట్ కోసం ఎప్పటినుంచో ప్రాక్టీస్ చేస్తోంది.కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్‌బ్రస్ (యూరప్), కోస్సియుస్కో (ఆస్ట్రేలియా), అకొన్‌కాగువా (దక్షిణ అమెరికా), డెనాలి (ఉత్తర అమెరికా), ఎవరెస్ట్ (ఆసియా)(Kilimanjaro (Africa), Elbrus (Europe), Kosciuszko (Australia), Aconcagua (South America), Denali (North America), Everest (Asia)) శిఖరాలను ఆల్రెడీ క్లైంబ్ చేసింది.16 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి ఔరా అనిపించింది.
కామ్య సాధించిన ఈ గ్రాండ్ సక్సెస్‌ను ఇండియన్ నేవీ ప్రశంసలతో ముంచెత్తింది.“కామ్య కార్తికేయన్ ఆఫ్రికాలోని కిలిమంజారో నుంచి అంటార్కిటికాలోని విన్సన్ వరకు ఏడు ఖండాల్లోని టాప్ పీక్స్‌ను క్లైంబ్ చేసిన యంగెస్ట్ గ్లోబల్ ఫీమేల్‌గా రికార్డు (Record as the youngest global female)క్రియేట్ చేసింది” అని కొనియాడింది.ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్ కూడా కామ్య సక్సెస్‌ను ఫుల్ జోష్‌లో సెలెబ్రేట్ చేసింది.సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, ఆమె రికార్డు కొట్టడం తమకు బిగ్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పింది.
నిజానికి, కామ్య సాధించిన అచీవ్‌మెంట్స్ ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్.మన ప్రధాని మోదీ కూడా 2020 ఫిబ్రవరిలో తన “మన్ కీ బాత్” ప్రోగ్రామ్‌లో కామ్య గురించి స్పెషల్ మెన్షన్ చేశారు.
ఆమె యూత్ ఐకాన్ అని కొనియాడారు.
కామ్య స్టోరీ డెడికేషన్, డిసిప్లిన్, హార్డ్ వర్క్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.ప్యాషన్, పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని ఆమె ప్రూవ్ చేసింది.తన సూపర్ సక్సెస్‌తో యూత్‌లో స్ఫూర్తి నింపింది.