పోషకాల కొరత, కాలుష్యం, కొన్ని రకాల మందుల వాడకం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి తదితర కారణాల వల్ల కొందరికి హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీని వల్ల జుట్టు రాలిపోతుంది.
కానీ కొత్త జుట్టు అనేది మొలవదు.ఫలితంగా కురులు పల్చగా మారిపోతూ ఉంటాయి.
అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి వండర్ ఫుల్ ఆయిల్ ఒకటి ఉంది.ఈ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం ఆగడమే కాదు ఊడిన జుట్టు కూడా మళ్లీ వస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ( Onion ) తీసుకుని తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) పోయాలి.ఆపై కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) రెండు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు వేసి ఉడికించాలి.దాదాపు పది నిమిషాల అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.
కురుల ఆరోగ్యానికి ఈ ఆయిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను ఉపయోగించాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం లేదా మరుసటి రోజు తేలిక పాటి షాంపూ తో తల స్నానం చేయాలి.
ఈ ఆయిల్ తయారీలో వాడిన ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు, బాదం ఇవన్నీ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.తలలో రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది.అదే సమయంలో కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది.కురులు ఒత్తుగా మారతాయి.
హెయిర్ డ్యామేజ్ సమస్య సైతం దూరం అవుతుంది.కాబట్టి ఒత్తైన దృఢమైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.