జుట్టును దట్టంగా పెంచే సూపర్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.

 This Is A Super Remedy That Makes Hair Grow Thicker! Thick Hair, Hair Growth, Ha-TeluguStop.com

పైగా హెయిర్ ఫాల్ మాత్రం విపరీతంగా జరుగుతుంటుంది.అయితే ఈ రెండు సమస్యలకు ఒక సొల్యూషన్ ఉంది.

ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని కనుక ప్రయత్నించారంటే జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడమే కాదు కురులు దట్టంగా సైతం పెరుగుతాయి.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టఫ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో పీల్ తొల‌గించిన ఒక అరటి పండును( Banana fruit ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.

అలాగే పావు కప్పు అవిసె గింజల జెల్, పావు కప్పు కొబ్బరి పాలు ( ¼ cup coconut milk )మరియు వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Remedy, Remedygrow-Telugu Health

ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి లేదా పది రోజులకు ఒకసారి ఈ హెయిర్ మాస్క్ కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

Telugu Care, Care Tips, Fall, Remedy, Remedygrow-Telugu Health

ముఖ్యంగా ఈ మాస్క్ జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తుంది.జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.జుట్టు దట్టంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.అంతేకాకుండా ఈ మాస్క్ వేసుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ సమస్య త‌గ్గు ముఖం పడుతుంది.

జుట్టు సహజంగానే సిల్కీగా షైనీగా కూడా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube