ఈమధ్య కాలంలో చాలామంది ఎంతో కష్టపడి పని చేసుకోవడం వలన నీరసం, అలసట, బలహీనత, నిస్సత్తువ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు.ఇక రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు.
అంతేకాకుండా ఎముకలు బలహీనంగా మారడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు.ఇలాంటి సమస్యలన్నీ ఒక చక్కటి చిట్కా ద్వారా నయం చేసుకోవచ్చు.
అయితే ఈ చిట్కాలు తయారు చేసుకోవడం అలాగే ఉపయోగించడం కూడా చాలా సులభం.

దీనిని వాడడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) దూరం అవుతాయి.శరీరానికి ఈ చిట్కా మంచి శక్తిని ఇస్తుంది.తయారు చేసుకోవడానికి మనం గసగసాలను, పాలను, ఫూల్ మాఖ్నా( Poppy, milk, Phool Makhna ) ను తీసుకోవాలి.
తామర గింజల నుండి తయారు అయ్యే ఈ ఫూల్ మాఖ్నా మార్కెట్లో విరివిగా లభిస్తుంది.వీటితో కూరను తయారు చేసుకొని తింటూ ఉంటారు.అయితే ఫూల్ మాఖ్నా లో చాలా పోషకాలు ఉన్నాయి.దీనిని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
అలాగే ఫూల్ మాఖ్నా లో కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

దీనిని తీసుకోవడం వలన నిద్రలేమి సమస్యల( Insomnia problems ) నుండి బయటపడవచ్చు.అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.అంతే కాకుండా బరువు తగ్గడంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందించడంలో ఇది బాగా సహాయపడుతుంది.
అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.అంతే కాకుండా లైంగిక సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది.

గసగసాలలో కూడా ఎన్నో పోషకాలను కూడి ఉంది.ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్( Pain killers ) గా పని చేస్తాయి.ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జీర్ణశక్తి సక్రమంగా పనిచేయడంలో ఇది బాగా పనిచేస్తుంది.అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో గసగసాలు చాలా దోహదపడతాయి.అందుకే పాలలో గసగసాలు, ఫూల్ మాఖ్నా వేసి తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు లభించి అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి.