కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు అందాయి.ఈ మేరకు షోకాజ్ నోటీసులను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసింది.
మహేశ్వర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కమిటీ నోటీసులు అందించింది.ఈ నోటీసులకు గంటలోపు వివరణ ఇవ్వాలని టీపీసీసీ ఆదేశించింది.
మరోవైపు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతుందని తెలుస్తోంది.గత కొంతకాలంగా మహేశ్వర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని సమాచారం.







