శ్రీదేవి పక్కన కనిపిస్తున్న ఈ ఇద్దరు పిల్లలు కూడా టాలీవుడ్ హీరో మరియు హీరోయిన్స్ అని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ తమదైన మార్కుతో కొందరు హీరోయిన్లు మాత్రమే ముందుకు దూసుకెళ్తున్నారు.ఒక సంవత్సరానికి చాలా మంది హీరోయిన్లు వస్తారు కానీ కొందరు మాత్రం వచ్చి ఇక్కడే కొన్ని దశాబ్దాల పాటు వెలుగొందుతూ ఉంటారు అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు అచ్చం దేవకన్య నీ చూసినట్టుగా కనిపించే రూపం లో అమాయకత్వం కలగలసిన అభినయంతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసే తన ఎక్స్ప్రెషన్స్ తో శ్రీదేవి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది.

 Who Are The Kids With Heroine Sridevi , Heroine Sridevi, Actress Maheshwari Chil-TeluguStop.com

తెలుగులో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లో దేవకన్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో ఆల్మోస్ట్ అందరూ అగ్ర హీరోలతో ఆడిపాడింది.

Telugu Erra Gulabilu, Sridevi, Tamil Deva-Telugu Stop Exclusive Top Stories

తర్వాత ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నీ పెళ్లి చేసుకొని ముంబైలో స్థిరపడింది.అయితే శ్రీదేవి ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన తన మేనకోడలు మహేశ్వరి సైతం తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించింది.జె.డి.చక్రవర్తి హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా లో నటించి తనదైన నటనతో జనాల అందరినీ అలరించింది ఆ తర్వాత రవితేజ లాంటి హీరోతో నీకోసం అనే సినిమా చేసింది వడ్డే నవీన్ తో పెళ్లి లాంటి ఒక మంచి సినిమాలో నటించి అందరి మన్ననలు పొందింది అయితే వాళ్ల అత్తమ్మ శ్రీదేవి అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయిన మహేశ్వరి తెలుగులో మంచి సినిమాలే చేసిందని చెప్పొచ్చు.రాజశేఖర్ మెయిన్ రోల్ చేసిన మా అన్నయ్య సినిమా లో వినీత్ కి జోడిగా జత కట్టింది.అయితే మహేశ్వరి తమ్ముడు కూడా మంచి నటుడే.ఆయన పేరు దేవా తమిళ్ సినిమాలు చేస్తూ ఉంటాడు అయితే దేవా వాళ్ళ ఇంట్లో మాత్రం దేవా బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడాలని అనుకున్నారు.కానీ దేవా కి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది ముఖ్యంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలంటే చాలా ఇష్టం అయితే ఒకరోజు ఒక ఫంక్షన్ లో దేవా కి గౌతమ్ మీనన్ కలవడంతో దేవా గౌతమ్ మీనన్ తో మాట్లాడుతూ మీ సినిమాలో చాలా బాగుంటాయి సార్ ముఖ్యంగా మీరు తమిళ్ లో తీసిన కాకా కాకా అదే సినిమా తెలుగులో ఘర్షణ గా చేశారు రెండు సినిమాలు నేను చాలా సార్లు చూసాను సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పాడు అలాగే నాకు మీ దగ్గర వర్క్ చేయాలని ఉంది సార్ అని చెప్పి నేను ఇలా మహేశ్వరి గారి తమ్ముడిని అని చెప్పాడు.

Telugu Erra Gulabilu, Sridevi, Tamil Deva-Telugu Stop Exclusive Top Stories

గౌతమ్ మీనన్ దగ్గర వర్క్ చేయడానికి గౌతమ్ మీనన్ ఓకే అన్నాడు దాంతో రెండు సినిమాలకు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు దాని తర్వాత ఒక రోజు నైట్ దేవా ని పిలిచి గౌతమ్ మీనన్ ఒక స్టోరీ చెప్పాడు అది సస్పెన్స్ స్టోరీ అది విన్న దేవా స్టొరీ బాగుంది సార్ కానీ ఘర్షణ ఒక ఏం మాయ చేశావే లాంటి సినిమాలు చేసినా మీరు ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పాడు దాంతో గౌతమ్ మీనన్ ఈ సినిమా మనం చేసి యూత్ కి ఒక మంచి మెసేజ్ చెప్పాలి అని దేవా తో చెప్పాడు ఆ విషయం చెప్పి దేవా తో గౌతమ్ మీనన్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది అది నువ్వే చేయాలి అని చెప్పి అతన్ని ఒప్పించి అతని చేత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయించాడు ఆ సినిమా ఎర్ర గులాబీలు అనే పేరుతో తెలుగులో డబ్ అయింది ఈ సినిమా ప్రివ్యూ కి శ్రీదేవి కూడా బోని కపూర్ తో సహా వచ్చింది.చాలాసార్లు దేవా మాట్లాడుతూ శ్రీదేవి గారు తనకి తల్లి లాంటి వారని చెప్పారు.అలాగే శ్రీదేవి కూడా దేవా నాకు చాలా దగ్గర మనిషి అని చెప్పుకొచ్చింది ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం చేస్తాడు అనుకున్నాం కానీ సినిమాల్లోకి వస్తాడు అని అనుకోలేదు.సినిమాల్లోకి రావాలనే ఆలోచన మంచిది అలాగే సినిమాల్లో నటన కూడా బాగా చేస్తున్నాడు అని అతన్ని మెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube