వెయిట్ లాస్ కు తోడ్పడే సూపర్ ఎఫెక్టివ్ డ్రింక్ ఇది.. తప్పక ట్రై చేయండి!

ఇటీవల రోజుల్లో ఓవర్ వెయిట్( Over Weight ) కారణంగా బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి తదితర అంశాలు బరువు పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

 This Is A Super Effective Drink That Supports Weight Loss Details, Weight Loss,-TeluguStop.com

ఏదేమైనా అధిక శరీర బరువు అనేక జబ్బులకు మూలం.కాబట్టి ఆరోగ్యమైన జీవితం కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడం చాలా అవసరం.

అయితే వెయిట్ లాస్ కు( Weight Loss ) తోడ్పడే సూపర్ ఎఫెక్టివ్ డ్రింక్ ఒకటి ఉంది.ఈ డ్రింక్ ను కనుక రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Telugu Ginger, Tips, Honey, Lemon, Tulsi Powder-Telugu Health

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Ginger ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి( Tulsi Leaves Powder ) వేసి పది నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్ట‌వ్‌ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Ginger, Tips, Honey, Lemon, Tulsi Powder-Telugu Health

రోజు ఉదయం వేళ ఈ డ్రింక్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.అధిక బరువు సమస్య నుంచి క్రమంగా బయటపడతారు.పైగా ఈ డ్రింక్ జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది.వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరాన్ని తయారు చేస్తుంది.ఇక ఈ డ్రింక్ ను నిత్యం తీసుకోవడంతో పాటు కచ్చితంగా శరీరానికి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి.

రోజుకు అరగంట పాటు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయండి.తద్వారా మరింత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube