ఈ హోమ్ మేడ్ హెయిర్ టానిక్ తో జుట్టు సమస్యలకు చెప్పండి బై బై!

జుట్టు అధికంగా రాలిపోతుందా.? చుండ్రు సమస్యతో సతమతం అవుతున్నారా.? తరచూ జుట్టు ఎండు గడ్డిలా మారిపోతుందా.? జుట్టు కుదుళ్ళు బలహీనంగా త‌యార‌య్యాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఈ సమస్యలన్నిటికీ బై బై చెప్పడానికి ఒక అద్భుతమైన హోమ్ మేడ్ హెయిర్ టోనర్( Hair Toner ) ఉంది.

 Say Goodbye To Hair Problems With This Homemade Tonic Details, Hair Tonic, Home-TeluguStop.com

వారానికి ఒకసారి ఈ టానిక్ ను తయారు చేసుకుని వాడితే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.

Telugu Aloe Vera Gel, Amla Powder, Dry, Care, Care Tips, Fall, Problems, Tonic,

టానిక్ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో నాలుగు మందారం పువ్వులు( Hibiscus ) వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ( Amla ) ముక్కలు వేసి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Aloe Vera Gel, Amla Powder, Dry, Care, Care Tips, Fall, Problems, Tonic,

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర తర్వాత తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ హెయిర్ టానిక్ ను కనుక వాడితే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మందారం, ఉసిరిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, అమైనో ఆమ్లాలు మరియు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి.

ఇవి హెయిర్ రూట్స్ ను బోల‌పేతం చేస్తాయి.జుట్టు రాల‌డాన్ని అడ్డుకుంటాయి.

శిరోజాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అలాగే మందార లో ఉండే సహజమైన ఎమోలియెంట్ లక్షణాలు జుట్టుకు మెరుపు మరియు మృదుత్వాన్ని అందిస్తాయి.

పొడి జుట్టును రిపేర్ చేస్తాయి.ఇప్పుడు చెప్పుకున్న హెయిన్ టానిక్ ను వారానికి ఒక‌సారి వాడితే చుండ్రు స‌మ‌స్య దూరం అవుతుంది.

జుట్టు విర‌గ‌డం, చిట్ల‌డం వంటివి త‌గ్గుతాయి.కురులు ఆరోగ్యంగా, ఒత్తుగా పెర‌గ‌డం స్టార్ట్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube