ఏదైనా పార్టీలకు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అందరిలోనూ తామే అందంగా, ఎట్రాక్టివ్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు.ముఖ్యంగా మహిళల్లో ఆ కోరిక కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ముఖానికి రకరకాల క్రీములను పూస్తుంటారు.మార్కెట్‌లో లభ్యమయ్యే ఫేస్ ప్యాకులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లే ముందు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ ప్యాక్‌ను వేసుకుంటే గనుక ఫేస్ గ్లోగా, షైనీగా మెరిసిపోవడం ఖాయం.
మరి ఆ న్యాచురల్ ప్యాక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఎలా వాడాలి.? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల గ్రీన్ టీ పౌడర్, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు మరియు కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం వేసుకుని.స్లో ఫ్లేమ్‌పై స్పూన్‌తో తిప్పుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని చల్లార బెట్టుకోవాలి.ఆపై అందులో కొద్దిగా తేనె కలిపితే ప్యాక్ సిద్ధమైనట్టే.ఇక ఈ ప్యాక్‌ను ఎలా వేసుకోవాలీ అంటే.ముందు తడి క్లాత్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.ఆ తర్వాత ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి.పది హేను లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం బాగా రుద్దుకుంటూ కూల్ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ ప్యాక్‌ను పార్టీలకు వెళ్లే ముందు వేసుకుంటే గనుక.
చర్మంపై పేరుకు పోయిన మురికి, మృతకణాలు మరియు జిడ్డు తొలగిపోయి ముఖం గ్లోగా, ఫ్రెష్‌గా మెరిసిపోతుంది.