ప్రస్తుత చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతుంటారు.ఎందుకంటే ఈ సీజన్ లో చలి ఎక్కువగా ఉంటుంది.
అలాగే మనకు బద్ధకం కూడా ఎక్కువగానే ఉంటుంది.ఆ బద్దకం కారణంగా వ్యాయామం చేయడానికి అస్సలు మక్కువ చూపరు.
పైగా ఈ సీజన్ లో నూనెలో వేయించిన ఆహారాలకు, ఫాస్ట్ ఫుడ్స్ కు అధికంగా ఎట్రాక్ట్ అవుతుంటారు.ఏది పడితే అది తినేస్తుంటారు.
ఫలితంగా శరీర బరువు అదుపు తప్పుతుంది.అయితే బరువు పెరిగాక బాధపడటం కంటే పెరగక ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు వెల్లుల్లి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.చలికాలంలో త్వరగా బరువు పెరగకుండా ఉండాలనుకునేవారు వెల్లుల్లిని తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిలో( Garlic ) విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, సెలీనియం తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బరువు తగ్గడానికి పచ్చి వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు ఉదయం రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి.ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ ను తీసుకోవాలి.
ఈ విధంగా ప్రతిరోజు పచ్చి వెల్లుల్లిని తింటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.శరీరంలో క్యాలరీలు కరుగుతాయి.
వ్యాయామం ( Exercise )చెయ్యకపోయినా కూడా వెల్లుల్లిని తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

అలాగే పచ్చి వెల్లుల్లితో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా బయట ఆహారాలకు దూరంగా ఉండాలి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.
షుగర్ ను డైట్ లో నుంచి కట్ చేయాలి.ప్రోటీన్, ఫైబర్ తో సహా పోషకాలు మెండుగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి.తద్వారా వెయిట్ గెయిన్ ( Weight gain )అవ్వకుండా ఉంటారు.








