చాలామంది ప్రజలు ఆహారంలో నెయ్యిని ( ghee )భాగం చేసుకుంటూ ఉంటారు.రోటీ, గంజి, కిచిడి, ఉప్మా వంటి చాలా రకాల వంటకాలలో నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే నెయ్యితో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని చాలా మందికి తెలియదు.చర్మాన్ని మెరిసేలా చేయడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
మీరు కూడా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే నెయ్యిని ఉపయోగించవచ్చు.ముఖానికి నెయ్యిని వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.నెయ్యిలో కొవ్వులు, పోషకాలు( Fats , nutrients ) పుష్కలంగా ఉంటాయి.ఇది చర్మాన్ని తమ గా మారుస్తుంది.దీంతో చర్మం మృదువుగా ( Soft skin )మారుస్తుంది.ప్రతి రాత్రి మీ మొహానికి నెయ్యి రాసి మసాజ్ చేసుకుంటే మంచి మార్పును గమనించవచ్చు.నెయ్యిలో విటమిన్ ఏ( Vitamin A ) ఎక్కువగా ఉంటుంది.
ఇది చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది.ఫేషియల్ మసాజ్ కోసం కూడా నెయ్యిని ఉపయోగించవచ్చు.
ఇలా చేయడం వల్ల ముఖ కండరాలు ఉపశమనం పొందుతాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఒక చెంచా నెయ్యిలో, తేనె, నిమ్మరసం కలిపి ఫేస్ మాస్క్ తయారు చేసుకోవాలి.దీన్ని ముఖం పై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
మీరు నెయ్యిని క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు.దీని కోసం మీరు మీ వేళ్ళతో కొంచెం నెయ్యి తీసుకుని ముఖన్ని మసాజ్ చేయాలి.
తరచుగా ఇలా చేయడంతో మీరు మీ ముఖాన్ని సులభంగా మెరిసేలా చేసుకోవచ్చు.అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే అందరి చర్మం ఒకేలా ఉండదు.
ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది.నెయ్యి కొందరి చర్మానికి సరిపోతుంది.
మరి కొందరికి నెయ్యి సరిపోదు.నెయ్యి వాడడం వల్ల ముఖం పై ఎర్రటి దద్దుర్లు వంటి సమస్యలు ఎదురైతే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిది.