వియత్నాం( Vietnam ) దేశంలోని హనోయి నగరంలో ఫిబ్రవరి 14న జరిగిన బర్త్‌డే పార్టీలో( Birthday Party ) ఊహించని ఘోరం జరిగింది.బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో( Balloons Explosion ) జియాంగ్ ఫామ్( Giang Pham ) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆమె తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం క్షణాల్లో వైరల్ అయిపోయింది.
జియాంగ్ తన బర్త్‌డే పార్టీని బెలూన్లతో నిండిన రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటోంది.
ఆ రోజుని మరింత స్పెషల్ గా మార్చుకోవాలని, ఫొటోలు దిగేటప్పుడు పట్టుకోవడానికి మరికొన్ని బెలూన్లు తెప్పించింది.పార్టీ అయిపోయాక, స్టేజ్ మీద నిలబడి ఒక చేతిలో బర్త్‌డే కేక్, మరో చేతిలో బెలూన్లు పట్టుకుని ఫోటోలకు పోజులివ్వడానికి సిద్ధమైంది.
అంతలోనే ఊహించని ప్రమాదం చేసుకుంది.కేక్‌పై వెలుగుతున్న కొవ్వొత్తులు( Candles ) బెలూన్లకు తగలడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి జియాంగ్ ముఖాన్ని కాల్చేశాయి.

షాక్‌కి గురైన జియాంగ్ భయంతో కేక్, బెలూన్లు కిందపడేసింది.మంటల వేడికి ముఖం కాలిపోతుండటంతో చేతులతో మూసుకుని బాత్‌రూమ్‌లోకి పరుగెత్తింది.అక్కడ ముఖంపై నీళ్లు చల్లుకుని కాస్త ఉపశమనం పొందింది.
ఆ తర్వాత వెంటనే హాస్పిటల్‌కి వెళ్లినట్లు సమాచారం.
ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే, ఆ వీడియోని తను కొన్ని రోజుల వరకు చూడలేకపోయిందట జియాంగ్.“రోజులు తరబడి ఏడ్చాను.నా ముఖంపై మచ్చలు పడితే నా జీవితం, ఉద్యోగం ఏమైపోతాయో అని భయపడ్డాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

డాక్టర్లు పరీక్షించి ఆమెకు ఫస్ట్, సెకండ్ డిగ్రీ బర్న్స్ అయ్యాయని చెప్పారు.కానీ పర్మినెంట్ మచ్చలు మాత్రం రావని ధైర్యం చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.అయితే, చర్మం తన సహజ రంగులోకి రావడానికి మాత్రం కొన్ని నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారట.
ఆ తర్వాత జియాంగ్ షాకింగ్ నిజం తెలుసుకుంది.
ఆమె కొన్న బెలూన్లలో హైడ్రోజన్ గ్యాస్( Hydrogen Gas ) నింపారని, అది చాలా ప్రమాదకరమని తెలిసింది.బెలూన్లు అమ్మిన వ్యక్తి ఈ విషయం గురించి తనకు చెప్పలేదని బాధపడింది.
రెస్టారెంట్‌లో ఉన్న బెలూన్లలో సాధారణ గాలి నింపారని, ఒకవేళ వాటిలో కూడా హైడ్రోజన్ ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని జియాంగ్ ఆందోళన చెందింది.ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.







