హీలింగ్ పేరుతో బాలికతో బాబా అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రులు చూస్తుండగానే దారుణం.. నెటిజన్లు ఫైర్!

దేశంలో దొంగ బాబాల( Fake Baba ) ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి.అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని వాళ్లని మోసం చేస్తున్నారు.

 Fake Baba Inappropriate Behavior With Girl In The Name Of Healing Video Viral De-TeluguStop.com

సమస్యలు తీరుస్తామని నమ్మబలికి నిలువునా దోచుకుంటున్నారు.కొంతమంది మరీ దారుణంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు కూడా పాల్పడుతున్నారు.

ఇలాంటి ఘోరమైన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ దొంగ బాబా హీలింగ్( Healing ) పేరుతో ఓ చిన్నారి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.

షాకింగ్ విషయం ఏంటంటే, ఆ బాలిక తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు.కళ్లారా చూస్తూ ఏమీ చేయలేకపోయారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.బాబాని తిడుతూనే తల్లిదండ్రుల తీరుని కూడా తప్పుపడుతున్నారు.

‘hellodoctortalks’ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు.“సిగ్గులేని తల్లిదండ్రులు.వీడేం ట్రీట్మెంట్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు” అంటూ క్యాప్షన్ పెట్టారు.వీడియోలో బాబా బాలిక కడుపుపై చేతులు వేసి నొక్కుతూ ఏదో హీలింగ్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు.

బాలిక సమస్య ఏంటని అడుగుతూ ఆమె చెప్పేలోపే వేరే చోటల్లా తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు.ఆ చిన్నారి చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నా.తల్లిదండ్రులు మాత్రం పక్కనే కూర్చొని ఏమీ అనకుండా చూస్తూ ఊరుకున్నారు.

ఈ వీడియో ఇంతకుముందు కూడా వైరల్( Viral Video ) అయింది.మళ్లీ ఇప్పుడు వైరల్ కావడంతో జనాలు మూఢనమ్మకాల గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఇది పక్కాగా లైంగిక వేధింపుల కేసు అని చాలామంది అంటున్నారు.

కామెంట్ సెక్షన్ లో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.“వీళ్లెలాంటి తల్లిదండ్రులు?” అని ఒకరు, “భారతదేశానికి అతిపెద్ద సమస్య మూఢనమ్మకం” అని ఇంకొకరు, “ఇది కచ్చితంగా సెక్సువల్ హరాస్మెంట్” అని మరొకరు.“ఆ అమ్మాయి నొప్పిలో, ఇబ్బందిగా ఉంది.తల్లిదండ్రులు ఎందుకు ఆపడం లేదు?” అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ అవుతుండటంతో.ఇలాంటి దొంగ బాబాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అమాయక కుటుంబాలను మోసం చేసే ఇలాంటి మోసగాళ్ల ఆట కట్టించాలని అందరూ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube