జపాన్ స్కూళ్లలో( Japan Schools ) పిల్లల కోసం పెట్టే భోజనం చూస్తే ఎవరికైనా కళ్లు చెదిరిపోవాల్సిందే.జూకనాన727 అనే జపనీస్ ఫుడ్ వ్లాగర్ పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.జపాన్‌లోని సైతామా నగరంలోని ఒక మిడిల్ స్కూల్‌లో పిల్లల కోసం ఎంత పౌష్టికాహారం( Nutritious Food ) తయారు చేస్తున్నారో చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.
వీడియో స్టార్ట్ చేస్తేనే ఒక పెద్ద గిన్నెలో వేడివేడిగా ఆవిరిలు కక్కుతున్న పదార్థాలు కనిపిస్తాయి.
కెమెరా జూమ్ చేసి చూస్తే.క్యాబేజీ, క్యారెట్, ఆకుకూరలు లాంటి రంగురంగుల కూరగాయలు ఉడుకుతూ ఉంటాయి.వీటితోనే గుడ్లు, చికెన్ కలిపి అదిరిపోయే చికెన్ మీట్‌బాల్ సూప్ తయారు చేస్తారు.
“నేను సైతామాలోని ఒక పబ్లిక్ మిడిల్ స్కూల్‌కి వెళ్లాను.అక్కడ స్కూల్ లంచ్( School Lunch ) ఎలా తయారు చేస్తున్నారో చూడటానికి.ఇదిగో చూడండి, వెజిటబుల్ చికెన్ మీట్‌బాల్ సూప్ రెడీ అవుతోంది” అని వ్లాగర్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అంతేకాదు, జపాన్ స్కూల్ మీల్స్‌లో( Japan Schools Meals ) పోషకాలు, పరిశుభ్రతకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయట.
వీడియోలో వంట చేసే ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ చూపించారు.చాలా మంది స్టాఫ్ గ్లోవ్స్ వేసుకొని ఎంతో జాగ్రత్తగా, పరిశుభ్రంగా పదార్థాలు రెడీ చేస్తున్నారు.మొదట్లో అయితే కిచెన్‌లో బోలెడన్ని కూరగాయలు కట్ చేస్తూ, వండుతూ కనిపించాయి.
కానీ ఫైనల్ డిష్ మాత్రం వెజిటేరియన్ కాదులెండి.గుడ్లు, చికెన్ మీట్‌బాల్స్ కూడా యాడ్ చేస్తారు.
ప్రోటీన్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ తో బ్యాలెన్స్డ్ మీల్ అన్నమాట.వంట ప్రాసెస్ చూస్తే చాలా టైం తీసుకునేలా ఉంది, కానీ రిజల్ట్ మాత్రం అదుర్స్.
పౌష్టికాహారం నిండిన మీల్ రెడీ అయిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారో లేదో.జనాలు జపాన్ స్కూల్ ఫుడ్ క్వాలిటీకి ఫిదా అయిపోయారు.కూరగాయలు, మాంసం సమృద్ధిగా ఉండే హెల్తీ మీల్స్ జపాన్ స్కూల్స్ ఎలా పెడుతున్నాయో అని అందరూ పొగిడేస్తున్నారు.
కొంతమంది అయితే వాళ్ల దేశాల్లోని మీల్స్‌తో కంపేర్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఒక యూజర్ అయితే ఫన్నీగా “ఇది ఇండియాలో 7-స్టార్ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ లా ఉంది.” అని కామెంట్ చేశారు.జపాన్ వాళ్లు స్కూల్ ఫుడ్ విషయంలో ఇంత శ్రద్ధ పెట్టడం వల్లే అక్కడి పిల్లలు అంత హెల్దీగా ఉంటారని చాలామంది అంటున్నారు.
“జపాన్ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.యూఎస్ఏలో పిల్లల్లా కాదు” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, ఇంకొకరు “సీజనల్ ఇంగ్రిడియంట్స్ యూస్ చేసి పిల్లల కోసం హెల్తీ మీల్స్ బాగా చేస్తున్నారు” అని మెచ్చుకున్నారు.